Etihad Airways | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు చెందిన జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్వేస్ (Etihad Airways) భారతీయుల (Indians) కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ వేసవిలో తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే భారతీయ ప్రయాణికులకు విమాన టికెట్లపై 30 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమ్మర్లో వెకేషన్ కోసం టర్కీ, గ్రీస్, స్పెయిన్, ఫ్రాన్స్, వార్సా, ప్రాగ్ రూట్లలో ప్రయాణించే వారికి ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ వర్తించనుంది. మార్చి 28 వరకు తగ్గింపు ఛార్జీలతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇలా టికెట్ బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించొచ్చని ప్రకటనలో ఎతిహాద్ ఎయిర్వేస్ పేర్కొంది. ఈ వేసవిలో భారతీయ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడమే ఈ ఆఫర్ ముఖ్య ఉద్దేశంగా సంస్థ తెలిపింది. ప్రయాణికులు వీలైనంత త్వరగా తమ టికెట్లు బుక్ చేసుకుని ఈ సమ్మర్ వెకేషన్‌ను తక్కువ బడ్జెట్‌తో ఆస్వాదించాలని సూచించింది.
Also Read..
Bhupesh Baghel | భూపేశ్ బఘేల్ చుట్టూ కేసుల ఉచ్చు.. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో సీబీఐ దాడులు
Donald Trump | ట్రంప్ మరో సంచలనం.. భారత్‌ను ఉదహరిస్తూ అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులు
Viranica Reddy| మంచు ఫ్యామిలీ గొడవలపై తొలిసారి స్పందించిన మంచు విష్ణు భార్య..!