Bhupesh Baghel | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ (Bhupesh Baghel) చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) ముడుపుల కేసులో సీబీఐ (CBI) అధికారులు మాజీ సీఎం నివాసంలో దాడులు నిర్వహిస్తున్నారు. రాయ్‌పూర్, భిలాయ్‌లోని ఆయన నివాసాలతోపాటు బంధువులు, అత్యంత సన్నిహితుల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి మాజీ సీఎంకు రూ.508 కోట్ల ముడుపులు అందాయని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. యాప్ యజమానిగా భావిస్తున్న శుభమ్ సోని నేరాన్ని ఒప్పుకోవడంతో బఘేల్ చిక్కుల్లో పడ్డారు. తనకు, బఘేల్‌కు ఉన్న సంబంధాల గురించి ఆయన వెల్లడించడమే కాక, బఘేల్‌కు వందలాది కోట్ల రూపాయలను ముడుపులుగా ఇచ్చానని అంగీకరించారు. ఆయన ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే విచారణ చేపట్టింది.
మరోవైపు మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై భూపేశ్ బఘేల్, ఆయన కుమారుడు చైతన్య బఘేల్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవలే దాడులు చేసిన విషయం తెలిసిందే. భిలాయ్‌లోని ఆయన నివాసంతోపాటు చైతన్య స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.30 లక్షల నగదు, పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో చైతన్య బఘేల్‌కు ఈడీ అధికారులు సమన్లు కూడా జారీ చేశారు. కాగా, మద్యం కుంభకోణం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం పాటిల్లిందని, మద్యం సిండికేట్‌కు రూ.21 వేల కోట్లకు పైగా లాభం చేకూరిందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తున్నది. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే చైతన్య బఘేల్ నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు.
Also Read..
Big Blow | సైబర్ నేరగాళ్లకు కేంద్రం షాక్.. 7.18లక్షల సిమ్‌లు, 83వేల వాట్సాప్ అకౌంట్స్ బ్లాక్..!
BJP | నకిలీకి కేరాఫ్ బీజేపీ.. అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న టాప్-10 ఇండియన్ ఇన్ఫ్లూయెన్సర్లు
Bihar | తండ్రీకూతుళ్లను కాల్చి చంపిన దుండుగుడు.. బిహార్‌లో దారుణం