Viranica Reddy| కొద్ది రోజుల క్రితం మంచు ఫ్యామిలీ వివాదం ఎంత పెద్ద రచ్చగా మారిందో మనం చూశాం. మోహన్ బాబు, విష్ణు ఒకవైపు మంచు మనోజ్ మరో వైపు. పోలీస్ స్టేషన్ వరకు వీరి గొడవ వెళ్లడం, దానిని మీడియా కవర్ చేయడంతో మంచు ఫ్యామిలీ ఎవ్వారం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఆస్తుల విషయంలోనే వారికి గొడవలు జరిగినట్టు అందరు భావించారు. కాకపోతే అసలు నిజం ఏంటన్నది ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే తాజాగా మంచు విష్ణు భార్య విరానికా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలియజేసింది. ఈ నేపథ్యంలో జీవన శైలి..పిల్లలు..భర్త విష్ణు గురించి కొన్ని విషయాలు పంచుకోగా, ఆ విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మంచు ఫ్యామిలీ లో తలెత్తిన వివాదం గురించి విరానికా మాట్లాడుతూ.. ప్రతీ కుటుంబంలో సమస్యలుంటాయి. మా కుటుంబానికి కూడా దురదృష్టవశాత్తు అలాంటి సమస్యలు రావడం జరిగింది. ఇది మొత్తం కుటుంబంపై ప్రభావాన్ని చూపుతుంది.మేము ఆందోళన పడేది పిల్లల గురించి . ఇలాంటి విషయాలు పిల్లలపై ఎక్కువ ప్రభవాన్ని చూపిస్తాయి. కుటుంబంలోని సోదరుల మధ్య జరుగుతున్న తగాదాలను చూసి పిల్లలు కూడా భయపడిపోతున్నారు. పిల్లలు తెలివిగా ఉండాలంటే నేను కూడా అంతే తెలివిగా వ్యవరించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
నాకు నా పిల్లలు ముఖ్యం కాబట్టి ఆ ప్రభావం వారిపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది.. అందుకు నేను తీసుకునే జాగ్రత్తలు చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లలు అలాంటి వాటి పట్ల వారు ఆకర్షితులు కాకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని విరానికా చెప్పుకొచ్చింది. కుటుంబ వ్యవహారాల గురించి అడగగానే విరానికా ఇంత ఓపెన్ గా మాట్లాడటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. సాధారణంగా ఇంటర్వ్యూల్లో కుటుంబ విషయాల గురించి మాట్లాడటానికి ఎవరూ అంగీకరించరు. కానీ విరానికా ఎంతో బ్యాలెన్స్ గా మాట్లాడారు.