ములుగు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని గొడ్డలితో నరికి చంపారు. వివరాల్లోకి వెళ్తే..వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్ (28)ని గుర్తు తెలియని దుండగులు హతమర్చారు. సమాచారం అందుకున్న వెంకటాపురం సీఐ బండారు కుమార్, పేరూరు ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్ట్మార్టం నిమిత్తం కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించి విచారణ ప్రారంభించారు. విజయ్ హత్య పైన పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
check dams | మరమ్మతులు చేసేదెప్పుడో..? మత్తళ్ళు దూకేదెన్నడో..?
Sachin Tendulkar | కాజీరంగా నేషనల్ పార్క్లో సచిన్ జీపు సఫారీ.. VIDEO
Watermelon | వేసవి సీజన్లో పుచ్చకాయలను విడిచిపెట్టకుండా తినాల్సిందే.. ఎందుకంటే..?