Sachin Tendulkar | వీడ్కోలు అనంతరం క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ (Sachin Tendulkar) తన విలువైన సమయాన్ని కుటుంబం కోసం కేటాయిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కు వెళ్తూ సందడి చేస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు.
సచిన్ తాజాగా తన కుటుంబంతో కలిసి అస్సాం (Assam)లో పర్యటించారు. అక్కడి కాజీరంగా నేషనల్ పార్క్ (Kaziranga National Park)ను సందర్శించారు. పార్క్‌లో జీపు సఫారీ చేస్తూ సందడి చేశారు. అంతేకాదు.. అక్కడ ఏనుగులకు (elephants) ఆహారం కూడా అందించారు. ఈ సందర్భంగా అక్కడ ఎంతో సరదాగా గడిపారు. సచిన్ రాకపై సమాచారం తెలుసుకున్న అభిమానులు.. భారీగా అక్కడకు చేరుకున్నారు. ఆయనతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | Cricket legend Sachin Tendulkar feeds elephants and enjoys a jeep safari at Kaziranga National Park in Assam. pic.twitter.com/iJLHjezUxB
— ANI (@ANI) April 9, 2025
Also Read..
Dera Baba | డేరా చీఫ్‌కు మరోసారి పెరోల్.. ఈసారి ఎన్నిరోజులంటే..?
Rafale aircraft | రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో మెగా డీల్..!
Ram Darbar: అయోధ్య ఆలయంలో రామ్ దర్బార్ .. జూన్ 6వ తేదీ నుంచి భక్తులకు ప్రవేశం