Ram Darbar: అయోధ్య ఆలయంలో రామ్ దర్బార్ .. జూన్ 6వ తేదీ నుంచి భక్తులకు ప్రవేశం
Ram Darbar : అయోధ్య రామాలయంలోని ఫస్ట్ ఫ్లోర్లో నిర్మిస్తున్న రాం దర్బార్ జూన్ 6వ తేదీ నుంచి భక్తుల సందర్శనకు అందుబాటులోకి రానున్నది. రాముడు, సీత, లక్ష్మణుడు, భరత-శత్రుఘ్న, హనుమాన్ విగ్రహాలను ఆ దర్బార్‌లో ప్రతిష్టిస్తారు. మే 23వ తేదీ నుంచి పూజలు నిర్వహించనున్నట్లు నిర్మాణ కమిటీ చీఫ్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.
లక్నో: అయోధ్యలో నిర్మించిన రామాలయంలో.. రామ్ దర్బార్(Ram Darbar) భక్తులకు అందుబాటులోకి రానున్నది. జూన్ ఆరవ తేదీ నుంచి ఆ దర్బార్‌లోకి భక్తుల్ని అనుమతించనున్నారు. అయితే రామ్ దర్బార్ ఓపెనింగ్ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ ప్రక్రియతో అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి అయినట్లు అవుతుందున్నారు. 2020లో అయోధ్య ఆలయ నిర్మాణం ప్రారంభించిన విషయం తెలిసిందే. 2024లో రామ్‌లల్లా ప్రతిష్టాపన జరిగింది. ప్రధాని మోదీ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ట గత ఏడాదే జరిగిందని, అయితే ఇప్పుడు రాజారాంగా రాముడి విగ్రహాన్ని రామ్ దర్బార్‌లో ప్రతిష్టించనున్నట్లు నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఫస్ట్ ఫ్లోర్లో నిర్మిస్తున్న దర్బార్‌లో రాజా రామ్‌ను ప్రతిష్టిస్తారు. మే 23వ తేదీన జరిగే కార్యక్రమంలో రాముడు, సీత, రాముడి సోదరుల విగ్రహాలను ఆ రోజున ప్రతిష్టిస్తారని మిశ్రా వెల్లడించారు. దర్బార్‌లో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించిన సమయంలో పూజలు నిర్వహిస్తామని, కానీ అది ప్రాణ ప్రతిష్ట తరహాలో ఉండదన్నారు.
భక్తులకు రామ్ దర్బార్‌లోకి ప్రవేశం కల్పించడానికి ముందు పూజలు జరుగుతాయని మిశ్రా చెప్పారు. రకరకాలు పూజలు నిర్వహిస్తామని, అవి జూన్ 5వ తేదీన పూర్తి అవుతాయన్నారు. మే 23, జూన్ 5వ తేదీలను మంగళకరమైన రోజులగా భావిస్తున్నట్లు వెల్లడించారు. పూజ ముగిసిన తర్వాత జూన్ 6వ తేదీ నుంచి రామ్ దర్బార్‌లోకి భక్తుల్ని అనుమతిస్తారన్నారు.
జైపూర్ వైట్ మార్బుల్ తో చెక్కిన 5 అడుగుల ఎత్తు అయిన రాముడి విగ్రహాన్ని రామ్ దర్బార్‌లో ప్రతిష్టించనున్నారు. ఆ రాముడి విగ్రహంతో పాటు సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమాన్ విగ్రహాలు కూడా ఉంటాయన్నారు. పూజా కార్యక్రమాలను నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ ఆరో తేదీ వరకు ఆలయంలోని రెండవ ఫ్లోర్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రధాన ఆలయానికి చెందిన నిర్మాణ పనులు పూర్తి అవుతాయని, అయితే కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. జూన్ ఆరో తేదీ వరకు రామాలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో ఏడు ఆలయాలు కూడా పూర్తి అవుతాయన్నారు. దీంట్లో మహార్షి వాల్మీకి ఆలయం కూడా ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

