Rafale aircraft : భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం కేంద్రం మరో ముందడుగు వేసింది. రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల (Rafale Marine fighter aircraft) కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్ (France) దేశంతో మెగా డీల్ కుదుర్చుకుంది. రూ.63 వేల కోట్ల విలువైన ఈ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ (Government to Government deal) పై రెండు ప్రభుత్వాలు త్వరలో సంతకాలు చేయనున్నాయి.
ఒప్పందంలో భాగంగా భారత నావికాదళానికి ఫ్రాన్స్ నుంచి 22 సింగిల్ సీటర్, నాలుగు టు సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాయి. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.