Dera Baba | ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన ‘డేరా సచ్చా సౌదా’ (Dera Sacha Sauda) చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim Singh) అలియాస్ డేరా బాబా (Dera Baba) మరోసారి జైలు నుంచి బయటకు వచ్చారు. అతనికి ఈ సారి 21 రోజుల పెరోల్ లభించడంతో సింగ్ హర్యానాలోని రోహ్తక్లో గల సునారియా జైలు నుంచి బుధవారం ఉదయం విడుదలయ్యారు. అనంతరం సిర్సాలో ఉన్న డేరా ప్రధాన కార్యాలయానికి ఆయన వెళ్లిపోయారు. ఈ 21 రోజుల పెరోల్ సమయంలో ఆయన అక్కడే గడపనున్నారు.
2017లో ఇద్దరు శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన తరువాత కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అతడు హర్యానాలోని రోహ్తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, ఆయన వివిధ కారణాలతో పలుమార్లు పెరోల్‌పై బయటకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆయన పెరోల్ లభించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు అంటే జనవరిలో అతడికి 30 రోజుల పెరోల్ లభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి పెరోల్ లభించింది.
Also Read..
“Gurmeet Ram Rahim: 30 రోజుల పెరోల్‌పై రిలీజైన గుర్మీత్ రామ్ రహీమ్”
“Dera Baba | హర్యానా ఎన్నికల వేళ.. డేరా బాబాకు మరోసారి పెరోల్”
“Dera Baba | జైలు నుంచి మరోసారి బయటకు వచ్చిన డేరా బాబా”