Watermelon | వేసవి కాలంలో అందరూ చల్లని పదార్థాలను తింటుంటారు. వేసవి తాపం నుంచి తట్టుకోవాలంటే కచ్చితంగా చలువ చేసే ఆహారాలను తినాలి. వేసవి వచ్చిందంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పుచ్చకాయలు. ఈ సీజన్ లో మనకు ఈ పండ్లు ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి. పుచ్చకాయలను చాలా మంది నేరుగా అలాగే తింటారు. కొందరు జ్యూస్, సలాడ్స్ వంటివి తయారు చేసి తీసుకుంటారు. పుచ్చకాయలను మనం ఎలా తిన్నా సరే మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. వేసవి సీజన్లో కచ్చితంగా రోజూ పుచ్చకాయలను తినాలి. ఇవి మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. పుచ్చకాయలను తినడం వల్ల అనేక పోషకాలు కూడా లభిస్తాయి. వీటిని రోజూ ఒక కప్పు మోతాదులో తిన్నా చాలు ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
100 గ్రాముల పుచ్చకాయలను తింటే కేవలం 16 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. అలాగే ప్రోటీన్లు 2 గ్రాములు, కార్బొహైడ్రేట్లు 3.3 గ్రాములు, కొవ్వులు 0.2 గ్రాములు, పీచు 0.6 గ్రాములు, సోడియం 27.3 మిల్లీగ్రాములు, పొటాషియం 160 మిల్లీగ్రాములు లభిస్తాయి. అలాగే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్ సైతం సమృద్ధిగా లభిస్తాయి. పుచ్చకాయలను తింటే చాలా స్వల్ప మోతాదులో క్యాలరీలు లభిస్తాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చక్కని ఆహారం అని చెప్పవచ్చు. వీటిని తింటే చాలా తక్కువగా క్యాలరీలు లభిస్తాయి. పైగా ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఆకలి కూడా వేయదు. దీని వల్ల బరువు తగ్గుతారు. అధిక బరువు ఉన్నవారు రోజూ ఈ పండ్లను తింటుంటే మేలు జరుగుతుంది.
పుచ్చకాయల్లో అధికంగా ఉండే పొటాషియం మన శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. రక్తం సాఫీగా ప్రసరణ అయ్యేలా చూస్తుంది. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. హైబీపీ ఉన్నవారు పుచ్చకాయలను రోజూ తింటే ఎంతో మేలు పొందవచ్చు. అలాగే మూత్రాశయ సమస్యలు, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఈ కాయలను రోజూ తింటున్నా లేదా వీటి జ్యూస్‌ను తాగుతున్నా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. కిడ్నీలు క్లీన్ అవుతాయి. కిడ్నీల్లోని వ్యర్థాలు బయటకు పోతాయి. స్టోన్స్ కరిగిపోతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. పుచ్చకాయల్లో ఉండే యాటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు నష్టం జరగకుండా నివారించవచ్చు. దీని వల్ల క్యాన్సర్, హార్ట్ ఎటాక్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
వేసవిలో మన శరీరం సహజంగానే వేడిగా అవుతుంది. శరీరంలో వేడి పెరిగిపోతుంది. డీహైడ్రేషన్ బారిన పడతారు. శరీరంలోని ద్రవాలు త్వరగా బయటకు పోతాయి. కనుక ఈ సీజన్లో తప్పకుండా పుచ్చకాయను రోజూ తినాలి. ఇది శరీరంలోని వేడిని బయటకు పంపుతుంది. శరీరం చల్లగా ఉండేట్లు చూస్తుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఎండ దెబ్బ తగలకుండా సురక్షితంగా ఉండవచ్చు. వేసవిలో బయట తిరిగే వారి చర్మం కమిలిపోయినట్లు ఎర్రగా లేదా నల్లగా మారుతుంది. అలాంటి వారు రోజూ పుచ్చకాయలను తినాలి. దీంతో చర్మం సంరక్షించబడుతుంది. చర్మం రంగు మారకుండా ఉంటుంది. ఇలా పుచ్చకాయలను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. కాబట్టి వేసవి సీజన్లో మరిచిపోకుండా ఈ పండ్లను తినండి.