ములుగు : కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన ఇందిరమ్మ పథకం అభాసు పాలవుతున్నది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తూ అసలైన అర్హులకు మోసం చేస్తున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామంలో పొలాలు, ఆస్తులు ఉన్నవాళ్లకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉడుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానికులు పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందించారు. ఈ వ్యవహారంపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ మంజూరు చేయాలని వారు ఆ వినతి పత్రంలో కోరారు.
ఇవి కూడా చదవండి..
BRS | డాలస్ సభ విజయవంతం.. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించిన ఎన్ఆర్ఐలు
Chiranjeevi | ఆలీకి మామిడిపండ్లతో పాటు సురేఖ వంటకాలని పంపిన చిరంజీవి