Chiranjeevi | ఆలీకి మామిడిపండ్లతో పాటు సురేఖ వంటకాలని పంపిన చిరంజీవి
Chiranjeevi | కమెడీయన్ ఆలీ.. మెగా ఫ్యామిలీతో చాలా స్నేహంగా ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో ఆలీ ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలీ, పవన్ కళ్యాణ్‌లు బెస్ట్ ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ సినిమాల్లో దాదాపు ఆలీ ఉండాల్సిందే. పవన్ సినిమా అంటే అలీ కోసం ఒక క్యారెక్టర్ ప్రత్యేకించి రాసేవారంటే వీళ్లిద్దరి బాండింగ్ ఏ రేంజ్లో ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.
Chiranjeevi | కమెడీయన్ ఆలీ.. మెగా ఫ్యామిలీతో చాలా స్నేహంగా ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో ఆలీ ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలీ, పవన్ కళ్యాణ్‌లు బెస్ట్ ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ సినిమాల్లో దాదాపు ఆలీ ఉండాల్సిందే. పవన్ సినిమా అంటే అలీ కోసం ఒక క్యారెక్టర్ ప్రత్యేకించి రాసేవారంటే వీళ్లిద్దరి బాండింగ్ ఏ రేంజ్లో ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. అయితే పవన్ రాజకీయాలలో వెళ్లినప్పటి నుండి వీరి బాండింగ్‌కి కాస్త బీటలు వారాయి. ఆలీ పవన్ కళ్యాణ్‌ని కాదని.. ప్రత్యర్థి పార్టీలో చేరి.. జనసేన పార్టీపై విమర్శలు గుప్పిచడంతో కొంత రిలేషన్ దెబ్బతింది. అయితే ఆలీ కొద్ది రోజుల క్రితం రాజకీయాలకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ చేశారు.
అయితే ఆలీకి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక బహుమతి పంపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలీ.. పవన్ కళ్యాణ్‌తోనే కాకుండా చిరంజీవితోను సన్నిహితంగా ఉంటారు. వారిద్దరు కలిసి చాలా చిత్రాలలో నటించి మెప్పించారు. కొన్ని సందర్భాలలో ఆలీ.. చిరంజీవిపై తనకున్న అనుబంధాన్ని కూడా చాటుకున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టర్ చిరంజీవి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తన తోటలో పండిన మామిడి పండ్లను ప్రత్యేకంగా ప్యాక్ చేసి పంపారు. అయితే, ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. మామిడి పండ్లతో పాటు చిరంజీవి అర్ధాంగి సురేఖ వంటలను కూడా పంపించారు. అత్తమ్మాస్ కిచెన్ నుంచి ఆవకాయ పచ్చడితో పాటు పులిహోర, ఉప్మా, కేసరి, రసం, పొంగల్ వంటి రెడీ టూ మిక్స్ పొడులను కూడా పంపించారు.
చిరంజీవి నుండి వచ్చిన ప్రత్యేక బహుమతి వీడియోను అలీ అర్ధాంగి జుబేదా తన యూట్యూబ్, సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికి తెలిసింది. చిరంజీవి తమపై ఉన్న ప్రేమతో ఇవన్నీ పంపించడం చాలా సంతోషంగా ఉందని జుబేదా అన్నారు. ఇక చిరంజీవి ప్రస్తుతం అనీల్ రావిపూడి మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవల తొలి షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిరు ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం సిద్ధంగా ఉన్నారు. మరోవైపు చిరు నటించిన విశ్వంభర చిత్రం రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

