హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘దశాబ్దాల కాలపు కొట్లాటకు, నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు విముక్తి లభించిన రోజు నేడు. సుదీర్ఘ స్వప్నం.. సాకారమైన సుదినం నేడు. ‘తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్ సచ్చుడో.. కేసీఆర్ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ నినదించిన కేసీఆర్ గారు గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు. సబ్బండ వర్గాలు ఏకమై గర్జించి, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాట ఫలితం తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువ లేనివి. వారికి జోహార్లు.’ అంటూ హరీశ్ రావు ఎక్స్ వేదికగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దశాబ్దాల కాలపు కొట్లాటకు,
నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు
విముక్తి లభించిన రోజు నేడు.సుదీర్ఘ స్వప్నం.. సాకారమైన సుదినం నేడు.
‘తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్ సచ్చుడో..
కేసీఆర్ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ నినదించిన కేసీఆర్ గారు గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు.సబ్బండ… pic.twitter.com/K83N9b19CV
— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2025