Bike Rally | లింగాల ఘనపురం : మృత్యు ఒడిలోకి వెళ్లి.. తెగించి పోట్లాడి తెలంగాణ సాధించింది కేసీఆర్ అని.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిపింది కేసీఆర్ అని మాజీ వైస్ ఎంపీపీ చౌదర పెళ్లి శేఖర్ పునరుద్ఘాటించారు. నెల్లుట్లలో ఎల్కతుర్తి రజతోత్సవ సభకు బయలుదేరి వెళ్తున్న బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం రాకముందు ఈ ప్రాంత ప్రజల బతుకులు ఎట్లుండే.. వచ్చాక రైతులు ఎంత రాజుల్లా బతికారనే విషయం తెలంగాణలో పుట్టిన ప్రతీ బిడ్డకు తెలుసు అన్నారు. కానీ ప్రజలను మభ్యపెట్టి.. అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన మళ్లీ 50 ఏళ్ల కింద ఉన్న తెలంగాణ పరిస్థితులను తీసుకొచ్చిందని విమర్శించారు.
ఎల్కతుర్తి సభతో విపక్షాల విమర్శలన్నీ పటాపంచలు కావడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ కన్వీనర్ బసవ గాని శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు ఏదునూరి వీరన్న, దుంపల భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Giloy | సర్వ రోగ నివారిణి.. తిప్పతీగ.. మన చుట్టూ పరిసరాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది..!
Putta Madhukar | మంత్రి పదవి మంథనికి పైస మందం కూడా పనికొస్తలేదు : పుట్ట మధుకర్
BRS | బీఆర్ఎస్ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారు : దాసరి మనోహర్ రెడ్డి