సోమవారం 18 జనవరి 2021
Warangal-rural - Jul 26, 2020 , 01:39:42

మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు

మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు

  • పరకాల ఏసీపీ శ్రీనివాస్‌
  • ముమ్మరంగా వాహన తనిఖీలు

దామెర, జూలై 25: ఎవరైనా మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పరకాల ఏసీపీ శ్రీనివాస్‌ హెచ్చరించారు. మావోయిస్టులు ఇచ్చిన బంద్‌ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ పోలీసులు వరంగల్‌-భూపాలపట్నం జాతీయ రహదారిపై, ల్యాదెళ్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానితులను ప్రశ్నించారు. మావోయిస్టుల మాటలను ప్రజలు నమ్మొద్దని ఏసీపీ సూచించారు. గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తే సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై భాస్కర్‌రెడ్డి, ఏఎస్సైలు పోచయ్య, చారి పాల్గొన్నారు.

క్షుణ్ణంగా వాహనాల పరిశీలన

వర్ధన్నపేట/సంగెం/రాయపర్తి: పట్టణంలోని వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై వర్ధన్నపేట ఏసీపీ కార్యాలయ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. వరంగల్‌ సీపీ ప్రమోద్‌కుమార్‌ ఆదేశాల మేరకు పెట్రోలింగ్‌ చేశారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్‌, సీఐ విశ్వేశ్వర్‌, ఎస్సై వంశీకృష్ణ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, సంగెం మండలంలోని కాపులకనపర్తి వద్ద వరంగల్‌-మహబూబాబాద్‌ ప్రధాన రహదారిపై పర్వతగిరి సీఐ పుల్యాల కిషన్‌ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఏఎస్సై జైపాల్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు. అంతేకాకుండా రాయపర్తిలోని వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై వర్ధన్నపేట సీఐ విశ్వేశ్వర్‌, ఎస్సై గొదరి రాజ్‌కుమార్‌ నేతృత్వంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేశారు. గ్రామాల్లో పెట్రోలింగ్‌, గస్తీలు నిర్వహించారు. కార్యక్రమాలలో ఏఎస్సై మేకల లింగారెడ్డి, సిబ్బంది బొట్ల రాజు, సురేశ్‌, ఎడ్ల రవీందర్‌, రమేశ్‌, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, పూర్ణచందర్‌రెడ్డి, సోమ్లానాయక్‌ పాల్గొన్నారు.