బుధవారం 08 జూలై 2020
Warangal-rural - May 28, 2020 , 02:46:15

బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

  • అధికారులు సమన్వయంతో పనిచేయాలి
  • బాలల హక్కుల కమిషన్‌ రాష్ట్ర సభ్యురాలు శోభారాణి

రూరల్‌ కలెక్టరేట్‌ / హన్మకొండ, మే 27 :  వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేసి ఆపదలో ఉన్న బాలల సమస్యలు పరిష్కరించి జిల్లాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు అనుమాండ్ల శోభారాణి అన్నారు. బుధవా రం ఆమె రూరల్‌ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యం లో హన్మకొండలోని బాలరక్షక భవన్‌లో బాలలకు సంబంధించిన సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లో ఉన్న బాలల సమస్యలను అంగన్‌వాడీ టీచర్ల ద్వారా తెలుసుకొని పరిష్కార మార్గాలు సూచించాలన్నారు. బాలల హక్కులకు భంగం వాటిల్లితే వెంటనే ఉన్నతాధికారులకు  ఫిర్యాదు చేయాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్‌లైన్‌ సమస్యలను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

క్షేత్ర స్థాయిలో సూపర్‌వైజర్లు, సీడీపీవోలు సమన్వయంతో పనిచేస్తూ బాలల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. వారి హక్కులను రక్షిస్తూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని  సూచించారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ పరశురాములు మాట్లాడుతూ నిరాశ్రయులైన పిల్లలు ధైర్యాన్ని కోల్పోకుం డా ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, వసతులను సద్వినియోగం చేసుకొని జీవితంలో వారు కోరుకున్న స్థానాన్ని చేరుకోవడానికి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సహకారం అందిస్తుందని చెప్పారు. అలాగే ఉమ్మడి జిల్లాల ఐసీడీఎస్‌ రీజనల్‌ ఆర్గనైజర్‌ కమరున్నీసాబేగం మాట్లా డుతూ క్షేత్ర స్థాయిలో ఉన్న బాలల సమస్యలను 1098 చైల్డ్‌ లైన్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ లేదా జిల్లా అధికారులకు తెలియజేయాలని సూచించారు.  సమీక్షలో వారి వెంట డీసీపీ కే వెంకటలక్ష్మి, మామునూర్‌ ఏసీపీ శ్యాంసుందర్‌, జిల్లా సంక్షేమాధికారి కొట్టె చిన్నయ్య, ఏసీడీపీవో విజయలక్ష్మి,  డీడబ్ల్యూవో కే చిన్నయ్య, డీసీపీవో సంతోశ్‌కుమార్‌, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ మండల పరశురాములు, సభ్యులు మంజుల, వరంగల్‌ రూరల్‌ డీసీపీవో జీ మహేందర్‌రెడ్డి, రాజు, మధు, పాల్గొన్నారు. 


logo