Ricemill Owner | సుబేదారి, నవంబర్ 11 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శాయంపేట కాంట్రపల్లి ఐకేపీ సెంటర్లో రబీ సీజన్లో జరిగిన ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లు యజమానిని, అతని కుటుంబం సభ్యులు, బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈస్టు జోన్ డీసీపీ అంకిత్ కుమార్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు.
హనుమకొండ జిల్లా కమాలపూర్కు చెందిన సాంబశివ, రైస్ మిల్లు యజమాని బెజ్జంకి శ్రీనివాస్ రబీ ఎండాకాలం సీజన్లో కాంట్రపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ ఇంచార్జీ, ఏఈఓ సహకారంతో నకిలీ రైతులు, 12 మంది కుటుంబ సభ్యులు, బంధువుల పేరు మీద 8 వేల,49 క్వింటాళ్ల ధాన్యం విలువ రూ.2 కోట్ల 10 లక్షల అక్రమాలకు పాల్పడ్డాడు. సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు శాయంపేట పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేశారు.
ప్రధాన నిందితుడు రైస్ మిల్లు యజమాని బెజ్జంకి శ్రీనివాస్, భార్య ముగ్గురు కుమారులు, బంధువులు మొత్తం 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి రూ.9.50 లక్షల నగదు, కారు, రూ.32 లక్షల విలువ చేసే వ్యవసాయ భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో ఉన్న 54 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేసినట్లు డీసీపీ తెలిపారు.
Dharmasagar | యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : బ్యాంక్ మేనేజర్ అనిల్
Madhira : లడకబజార్లో ఉచిత వైద్య శిబిరం