మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సీఎం సొంత జిల్లాలో సామాన్యులు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి మహబూబ్‌నగర్‌లో లేదు.. పోలీసులే అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు’.. అని మా జీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. మంగళవారం బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు నిష్పక్షపాతంగా సజావుగా నిర్వహించాలని రాజ్యాంగ నియమావళిలో ఉన్నది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అధికారులందరూ ఎన్నికల కమిషన్ పరిధిలోనే పనిచేయాలి.
కానీ రాష్ట్రంలో కానీ.. మహబూబ్‌నగర్ జి ల్లాలో కానీ.. ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. పోలీసు అధికారులే మొత్తం నడుపుతున్నారు.. అన్ని శాఖల పను లు చేస్తున్నారు.. కాంగ్రెస్ కార్యకర్తలుగా మారారని ఆరోపించారు. తెలంగాణ పోలీస్ అంటేనే దేశంలో మంచి పే రు ఉంది. కొందరు అధికారుల తీరుతో చెడ్డపేరు వస్తుందన్నారు. పోస్టింగ్.. డబ్బుల కోసం కొందరు అధికారులు పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వెంట పెద్ద మొత్తంలో కార్యకర్తలను అనుమతించారు.
బీఆర్ఎస్ పార్టీ వారి వెంట మాత్రమే నిబంధనల ప్రకారం ముగ్గురిని పంపించారు.. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. నామినేషన్ ఉపసంహరించుకోమని ఒత్తిళ్లు తెచ్చారు.. వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ లేదని మాట్లాడుతున్న మీరు మా పార్టీని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ స్థాయిలో కొట్లాడుతూ ఇక్కడ కలిసి పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
పోలీసుల తీరుపై ఎన్నికల కమిషన్‌కు లెటర్ రాస్తున్నాం.. రా ష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయి. దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరాం. ఒక కమిటీ వేసి విచారణ నిర్వహించి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చే శారు. కొట్టడం.. బెదిరించడం.. ఇండ్ల మీదకు పోయి మీ నాన్న జాగ్రత్త.. నీ వ్యాపారం నడవదు అని బెదిరించడం ఏమిటీ? ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, ఎన్నికల్లో అధికారులు, కాంగ్రెస్‌కు అ నుకూలంగా వ్యవహరిస్తే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.
ఒక పార్టీకి సంబంధించి అభ్య ర్థి స్వచ్ఛందంగా మద్దతిస్తామని ముందుకొస్తే పోలీసులు బెదిరించి మాట మార్చేలా చే శారు.. ఇదెక్కడి సంస్కృతి అన్నారు. ఇ లాంటి అరాచక శక్తులకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైందని తెలిపారు. పోలీసుల తీరు మారకపో తే ఉద్యమాలు పెద్దమొత్తంలో మొ దలవుతాయి అని హెచ్చరించారు. అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్న అధికారులపై ఆ ధారాలతో సహా ఎన్నికల క మిషన్‌కు పంపించాం వారి ని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కూడా కో రినట్లు మాజీ మంత్రి వెల్లడించారు. సమావేశంలో న్యాయవాదులు బెక్కం జనార్దన్, మనోహర్, కరుణాకర్‌గౌడ్ స్వ దేశ్, ము రళి, ఉ మామహేశ్వరి, రవిప్రకాశ్, శ్రీహరి, రాంనాథ్గౌడ్, శ్రీరామ్‌కుమార్, మల్లికార్జున్, గణేశ్ పాల్గొన్నారు.