బుధవారం 28 అక్టోబర్ 2020
Warangal-city - Aug 18, 2020 , 03:13:10

కూలిన బతుకు

కూలిన బతుకు

  • n ఖిలా వరంగల్‌లో గోడ కూలి ఒకరు మృతి 
  • n మరో ఘటనలో ఇద్దరికి గాయాలు

ఖిలావరంగల్‌, ఆగస్టు 17 : భారీ వర్షాలకు మండలంలో పెద్ద ఎత్తున ఇళ్లు కూలిపోయాయి. సోమవారం తెల్లవారు జామున నిద్రలో ఉన్న ఓ వ్యక్తిపై ఇంటి గోడ కూలి అక్కడిక్కడే మృతి చెందగా మరో ప్రాంతంలో శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు వృద్ధులను స్థానికులు, పోలీసులు రక్షించారు. ఖిలావరంగల్‌ పడమర కోటకు చెందిన ఎడ్ల వెంకటేశ్వర్లు (60) అనారోగ్యంతో కొంత కాలంగా తన పాత ఇంటిలో ఒంటరిగా నివాసముంటున్నాడు. ఈ క్రమంలో గోడ కూలి నిద్రిస్తున్న వెంకటేశ్వర్లుపై పడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పడమర కోటలోని 9వ డివిజన్‌లో నర్సింగ, సుశీల ఇద్దరు వృద్ధ దంపతులు నివాసముంటున్నారు. సోమవారం ఇళ్లు పూర్తిగా నేలమట్టమైంది. దీంతో ఇంటి శిథిలాల కింద నుంచి వృద్ధుల కేకలు విన్న స్థానికులు, సమీపంలో ఉన్న మాజీ కార్పొరేటర్‌ కొప్పుల శ్రీనివాస్‌, మిల్స్‌కాలనీ బీట్‌ కానిస్టేబుళ్లు శిథిలాలను తొలగించి వారిని రక్షించారు. కూలిన ఇళ్లను 8, 9 డివిజన్ల కార్పొరేటర్లు బైరబోయిన దామోదర్‌యాదవ్‌, సోమిశెట్టి శ్రీలత, ప్రవీణ్‌ సందర్శించారు. logo