e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home వనపర్తి దేశానికే ఆదర్శంగా తెలంగాణ పథకాలు: ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

దేశానికే ఆదర్శంగా తెలంగాణ పథకాలు: ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి

ఆత్మకూరు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సాయి తిరుమల కల్యాణ మండపంలో మండలాధ్యక్షుడు రవికుమార్‌ యాదవ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు ప్రధాని మోదీ దేశంలో అమ లు చేస్తున్నారన్నారు. స్వరాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగు తున్నారన్నారు. ఎక్కడా కూడా కుల, మత, పార్టీ బేదాలు లేకుండా సంక్షేమ పథకాల అమలు జరుగుతుందన్నారు. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు జరిగిన ప్రగతి పనులే రాష్ట్ర సర్కారు పాలనకు నిదర్శనమని చెప్పారు.

- Advertisement -

తమ ఉనికిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. తమ పాలనలో జరిగిన అభివృద్ధి రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసన్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్ది పార్టీలోకి విపరీతమైన వలసలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. సర్కారు చేస్తున్న పనులను గ్రామ స్థాయిలో ఇంటింటికి చేరేలా కార్యకర్తలు పని చేయాలన్నారు. గ్రామాల్లో కార్యకర్తలే పార్టీకి ఎమ్మెల్యేలని అభివర్ణించారు.

ప్రజల ఆశీర్వాదం వల్లే తాను భారీ మెజారిటీతో గెలిచినట్లు, రాబోయే రోజుల్లో మరో 20 ఏండ్లు సీఎంగా కేసీఆరే వర్ధిల్లుతా రన్నారు. ఈ నెల29న నియోజకవర్గ కేంద్రం మక్తల్‌లో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు, సదస్సును జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన గ్రామ, మండల కమిటీ, అనుబంధ కమి టీల ప్రతినిధులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అదేవిధంగా నూతన కార్యవర్గాల ప్రతినిధులు సహితం గ్రామాల వారీగా ఎమ్మెల్యేను సత్కరించారు.

మూడోసారి మండలపార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రవికుమార్ యాదవ్‌ను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గాయత్రీ యాదవ్, వైస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీ పీ కోటేశ్వర్, రైతు బంధు నాయకుడు వీరేశలింగం, పీఏసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, లక్ష్మికాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ పీ శ్రీధర్‌గౌడ్, బీసీ, ఎస్సీ, మైనారిటీ సెల్ అధ్యక్ష, కార్యదర్శులు, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement