Airport Leopard | ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎట్టకేలకు చిరుతపులి (Airport Leopard) బోనులో చిక్కింది. చిరుతను పట్టుకోవడానికి అటవీ అధికారులు ఐదురోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది.
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎట్టకేలకు చిరుతపులి (Airport Leopard) బోనులో చిక్కింది. చిరుతను పట్టుకోవడానికి అటవీ అధికారులు ఐదురోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. పులికోసం ఐదు బోన్లు, 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బోనుల్లో మేకలను ఉంచినప్పటికీ అది చిక్కలేదు. పలుమార్లు బోను దగ్గరి వరకు వెచ్చిన చిరుత మళ్లీ వెనక్కి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అది బోనులో చిక్కడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పులిని నెహ్రూ జూపార్క్‌కు తరలించనున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి అమ్రాబాద్ అడవుల్లో వదిలివేయనున్నామని అధికారులు చెప్పారు.
గత ఆదివారం తెల్లవారుజామున (ఏప్రిల్ 28) గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత శంషాబాద్ విమానాశ్రయం లోపలికి వచ్చింది. ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్లకు అది తగలడంతో ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్‌లో అలారం మోగింది. దీంతో అప్రమత్తమైన విమానశ్రయ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత కోసం గాలింపు చేపట్టిన అధికారు ట్రాప్‌లు, బోన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

