e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home వికారాబాద్ లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధంగా ఉంచాలి

లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధంగా ఉంచాలి

లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధంగా ఉంచాలి

కొడంగల్‌, జూన్‌ 18: హరితహారం కార్యక్రమానికి మొక్కలు సిద్ధంగా ఉంచాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చం ద్రయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని నర్సరీను సందర్శించి మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ సూచించిన లక్ష్యం మేరకు గ్రామాల్లో మొక్కలను నాటేవిధంగా కార్యాచరణతో పాటు అందుకు తగ్గట్లుగా గుంతలను సిద్ధంగా చేసుకోవాలని తెలిపారు. నాటిన ప్రతి మొక్క బతికే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్యాలమద్ది గ్రామంలో శ్మశానవాటిన నిర్మా ణం పనులు ఎందుకు ప్రారంభం కాలేదని సర్పంచ్‌తో ఆరా తీశారు. స్మశాన వాటిక నిర్మాణానికి అధికారులు మూడు రోజుల క్రితం స్థలాన్ని కేటాయించారని, స్థలం అందుబాటులో లేని కారణంగా ఆలస్యమవుతున్నట్టు సర్పంచ్‌ అదనపు కలెక్టర్‌కు తెలిపారు. అదేవిధంగా పం చాయతీ కార్యదర్శి చాలా కాలంగా విధులకు హాజరు కావడం లేదని గ్రామస్తులు అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. పరిస్థితి మార్చుకోకుంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. త్వరలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచ్‌లతో పాటు ఎంపీడీవో మోహన్‌లాల్‌, ఏపీవో రాములు, ఎంపీవో శ్రీనివాస్‌తోపాటు ఫయూం పాల్గొన్నారు.

హరిత వనాలను చేద్దాం
ప్రతి గ్రామంలో మొక్కలను నాటి హరిత వనాలను చేద్దామని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సునితా పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంగన్‌వాడీ సెంటర్‌ వద్ద పలువురు అంగన్‌వాడి కార్యకర్తలకు మొక్కలను పంపిణీ చేసి, మొక్క లు నాటారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు అనుసూజ, నర్స మ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

మొక్కలు నాటేందుకు చర్యలు
చెల్లాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతివనంలో మొక్కలు నాటేందుకు చర్య లు తీసుకుంటున్నామని చెల్లాపూర్‌ గ్రామ సర్పంచ్‌ చంద్ర య్య, పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణ తెలిపారు. పల్లె ప్రకృతివనాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు తమవంతు కృషిచేస్తామన్నారు. పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలు నాటిస్తామని తెలిపారు. ఉపాధిహామీ కూలీల ద్వారా గుంతలు తీయించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ వెంకటయ్య, వార్డు సభ్యుడు గోపాల్‌, ఉపాధిహామీ టీఏ భగవంత్‌, కూలీలు పాల్గొన్నారు.

కులకచర్ల మండల పరిధిలో
హరితహారం కార్యక్రమానికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని కులకచర్ల ఏపీవో మల్లికార్జున్‌ అన్నారు. శుక్రవారం కులకచర్ల మండల పరిధిలోని విఠలాపూర్‌, వీరాపూర్‌, చౌడాపూర్‌ గ్రామాల్లో నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు బాగా పెంచి వాటిని హరితహారం కా ర్యక్రమం వరకు మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని అన్నారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలను పెంచేందుకు కృషిచేస్తుందని తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధంగా ఉంచాలి
లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధంగా ఉంచాలి
లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధంగా ఉంచాలి

ట్రెండింగ్‌

Advertisement