Adhir Ranjan Chowdhury | కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు, బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. లౌకికవాద శక్తులకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.
కాంగ్రెస్, వామపక్షాలు గెలవాలన్నారు. ఈ పార్టీలు గెలవకపోతే, లౌకికవాదం ప్రమాదంలో పడుతుందన్నారు. టీఎంసీకి ఓటు వేయడం కంటే బీజేపీకి ఓటు వేయడం బెటర్. కాబట్టి కాంగ్రెస్‌కి ఓటు వేయండి. బీజేపీ, టీఎంసీకి వేయొద్దు’ అని పేర్కొన్నారు. అయితే ఆ వీడియో ఎడిట్ చేసినదని కాంగ్రెస్ ఆరోపించింది.