వికారాబాద్, మే 1: సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. బుధవారం ఆయన వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని జాంబపూర్ తండాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని.. హామీల అమల్లో విఫలమైన హస్తం పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.
మరోసారి మోసపోకుండా కారు గుర్తుకు ఓటేసి, పొరపాటును సరిదిద్దుకుందామన్నారు. బీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్, బీజేపీలతో ప్రజలకు ఒరిగిందేమీలే దన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అనితాఅనంతయ్య, నాయకులు అనంతయ్య, చందర్, శ్రీనివాస్, గోవర్ధన్, రవి, హన్మంతు, యాదయ్య, శివయ్య, బోవయ్య, రాంచం దర్, రఘుపతి, శ్రీనివాస్‌రెడ్డి, యాదయ్య, రవి, చంద్రయ్య, గోపాల్ పాల్గొన్నారు.