న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలు జరిగే తీరును ప్రత్యక్షంగా చూసేందుకు 10 దేశాలకు చెందిన 18 రాజకీయ పార్టీల ప్రతినిధులు బుధవారం వచ్చారు. బీజేపీ ఆహ్వానంపై వచ్చిన వీరు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు సుబ్రహ్మణ్యం జైశంకర్, , లతో సమావేశమయ్యారు. వీరితో బీజేపీ ఎన్నికల ప్రచార వ్యూహాలు, దేశంలోని ఎన్నికల ప్రక్రియల గురించి చర్చించినట్లు నడ్డా ఓ ట్వీట్లో తెలిపారు. ‘బీజేపీ గురించి తెలుసుకోండి’ అనే కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరిగిందని చెప్పారు.