e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home రంగారెడ్డి Chevella : పేద ప్రజల పాలిట దేవుడు సీఎం కేసీఆర్‌.. ఎమ్మెల్యే కాలే యాదయ్య

Chevella : పేద ప్రజల పాలిట దేవుడు సీఎం కేసీఆర్‌.. ఎమ్మెల్యే కాలే యాదయ్య

చేవెళ్ల టౌన్‌ : పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న మహానుభావుడు సీఎం కేసీఆర్‌ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని పాల్గుట్ట గ్రామానికి చెందిన వాణి అనారోగ్యంతో నగరంలోని నిమ్స్​‍ దవాఖానలో చికిత్స పొందు తుండటంతో మేరుగైన వైద్యం కోసం ఆమె కుటుంబ సభ్యులకు రూ. 3 లక్షల ఎల్‌ఓసి చెక్కును ఎమ్మెల్యే తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఏం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా వైద్యం కోసం ఖర్చుయ్యే డబ్బులను ముందుస్తు గానే ఎల్‌ఓసీ ద్వారా అందించి వారిని ఆదుకుంటున్నట్లు చెప్పారు.

- Advertisement -

ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 70 సంవత్సరాల పాలనలో పేదలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. గుంట భూమి ఉన్న రైతు ప్రమాదవాశత్తు మృతి చెందితే రైతు బీమాతో ఆ కుటుంబానికి రూ. 5లక్షలు ప్రభుత్వం అందజేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement