Delhi Metro | కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో (Delhi Metro) తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్, ఘర్షణలు వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. రైలు కోచుల్లో వీడియోలను రికార్డు చేయడాన్ని నిషేధిస్తూ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. చాలా మంది ప్రయాణికులు ఇప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
తాజాగా మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మెట్రో రైలు కోచ్ లో ఇద్దరు మహిళలు పాత బాలీవుడ్ పాటకు ‘పోల్ డ్యాన్స్’ (Pole Dancing) చేస్తూ హల్ చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ‘ఢిల్లీ మెట్రోలో పోర్న్, కిస్సింగ్, ఫైటింగ్ తర్వాత. తాజాగా పోల్ డ్యాన్స్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘రీల్స్ తయారీదారులకు ఇదో కొత్త లొకేషన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
After porn, kissing and fighting in Delhi Metro,
The latest is Pole Dancing…..
🤣🤣🤣🤣🤣 pic.twitter.com/RpvKJ9jLny— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) July 6, 2023
Also Read..
Adipurush writer | ఆదిపురుష్ వివాదం.. క్షమాపణలు చెప్పిన డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్
Joe Biden | రసాయన ఆయుధాలను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రకటించిన అధ్యక్షుడు బైడెన్
snakes | వామ్మో.. ఆ ఇంట్లో 60 పాములు.. పెంపుడు పాములైతే కాదుగా..!