snakes | బీహార్ రాష్ట్రం రోహ్తాస్ (Rohtas) పట్టణంలో కుప్పలు తెప్పలుగా పాములు (snakes) బయటపడ్డాయి. ఒకే ఇంట్లో ఏకంగా 60 దాకా పాములు కలకలం రేపాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కో పాము వరుసగా ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన ఇంటి యజమాని స్థానికుల సాయంతో వచ్చిన పాములను వచ్చినట్టే సుమారు 20కిపైగా పాములకు చంపేసినట్లు తెలిపారు. అయితే, పాములు ఇంకా ఇంట్లో నుంచి వస్తూనే ఉండటంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. రంగంలోకి దిగిన అధికారులు అక్కడికి చేరుకొని ఆ పాములను పట్టుకున్నారు. ఇంటి గోడలు, ఫ్లోరింగ్ పగులగొట్టి సుమారు 30 పాములను బయటకు తీశారు. కాగా, ఇవన్నీ ఇండియన్ కోబ్రా జాతికి చెందిన పాములని అటవీ అధికారులు తెలిపారు. పాములు బైటపడిన ఇంటిని 1955లో నిర్మించినట్లు యజమాని తెలిపారు.
Also Read..
Vignesh Shivan | నయన్ దంపతులపై కేసు నమోదు.. ఆస్తి కాజేశారంటూ ఫిర్యాదు..?
Rahul Gandhi | పొలంలోకి దిగి.. ట్రాక్టర్‌తో దుక్కి దున్నిన రాహుల్ గాంధీ
Kiara Advani | పానీపూరీ పెట్టి అత్తను బుట్టలో వేసుకున్న కియారా అద్వానీ