Rahul Gandhi | పొలంలోకి దిగి.. ట్రాక్టర్‌తో దుక్కి దున్నిన రాహుల్ గాంధీ
‘మోదీ ఇంటి పేరు’ విషయంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రజలతో మమేకమవుతూ ముందుకుసాగుతున్నారు. వారి కష్టాలు, సమస్యలు తెలుసుకుంటున్నారు. శనివారం ఉదయం ఆయన ఢిల్లీ (Delhi) నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని (Himachal Pradesh) షిమ్లా (Shimla) వెళ్తున్నారు.
న్యూఢిల్లీ: ‘మోదీ ఇంటి పేరు’ విషయంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రజలతో మమేకమవుతూ ముందుకుసాగుతున్నారు. వారి కష్టాలు, సమస్యలు తెలుసుకుంటున్నారు. శనివారం ఉదయం ఆయన ఢిల్లీ (Delhi) నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని (Himachal Pradesh) షిమ్లా (Shimla) వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో హర్యానాలోని (Haryana) సోనీపట్ (Sonipat) సమీపంలో ఉన్న మదీనా (Madina) గ్రామ శివార్లలోని పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులను చూసి తన కాన్వాయ్‌ను ఆపారు. ప్యాంటును మోకాళ్లవరకు మడిచి పొలంలోకి దిగారు. అక్కడ వరినాటుతున్న రైతులతో ఆప్యాయంగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి వరి నాట్లు వేశారు. ట్రాక్టర్ ఎక్కి దుక్కిదున్నారు.

Rahul
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడిన విషయం తెలిసిందే. అదే పంథాను ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గత నెల ట్రక్కు డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు హర్యానాలో లారీ ఎక్కిన ఆయన వంద కిలోమీటర్ల వరకు అందులో ప్రయాణించారు. మధ్యలో ధాబాలో టీ తాగుతూ డ్రైవర్లతో మాట్లాడారు. అదేవిధంగా ఇటీవల ఢిల్లీలోని బైక్ మెకానిక్ వర్క్‌షాపును వెళ్లి.. పానా పట్టి బైక్‌ను ఎలా రిపేర్ చేయాలో మెకానిక్‌లను అడిగి తెలుసుకున్నారు.
Haryana | On his way from Delhi to Shimla (Himachal Pradesh) Congress leader Rahul Gandhi reached Sonipat earlier this morning, where he met farmers at various villages of Baroda. He joined them in the sowing process, as they worked at the fields in Baroda and Madina. pic.twitter.com/IO3byBuN0y
— ANI (@ANI) July 8, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

