Air India Express | విమాన ప్రయాణ సమయంలో ప్రయాణికుల ప్రవర్తన మితిమీరిపోతోంది. కొందరు అనుచిత ప్రవర్తన, అనవసరమైన గొడవలతో తోటి ప్రయాణికులకు, విమాన సిబ్బందికి అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ఇటీవలే కాలంలో నిత్యం ఇలాంటి ఘటనలే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం (Air India Express flight)లో ఓ ప్రయాణికుడు క్రూ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించాడు (Kerala man misbehaves with crew).
కేరళ రాష్ట్రం కన్నూర్కు చెందిన మమహ్మద్ బిసి అనే వ్యక్తి మే 8వ తేదీన దుబాయ్ నుంచి మంగళూరుకు (Dubai to Mangaluru) ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ప్రయాణించాడు. అయితే, ప్రయాణ సమయంలో విమానంలో వికృతంగా ప్రవర్తిస్తూ.. తోటి ప్రయాణికులకు, క్రూ సిబ్బందికి ఇబ్బందులు సృష్టించాడు. విమానం నుంచి సముద్రంలోకి దూకేస్తా అంటూ సిబ్బందిని బెదిరించాడు. దీంతో భయాందోళకు గురైన సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక విమానం మంగళూరులో ల్యాండ్ కాగానే అతన్ని పోలీసులకు అప్పగించారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ సిద్ధార్థ్ దాస్ ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అతడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Also Read..
Arvind Kejriwal | అందుకే జైలుకెళ్లినా సీఎం పదవికి రాజీనామా చేయలేదు : అరవింద్ కేజ్రీవాల్
Ink Mark | తొమ్మిదేళ్లయినా చెరగని సిరా గుర్తు.. కేరళ మహిళకు తలనొప్పిగా మారిన ఇంక్ మార్క్
Badrinath Temple | తెరుచుకున్న బద్రినాథ్ ఆలయ తలుపులు.. పోటెత్తిన భక్తులు