Ink Mark | సిరా గుర్తు (Ink Mark).. ఈ పదం గురించి తెలియని వారు ఉండరు. ఎన్నికలు (Elections) ఏవైనా ఓటు (vote) వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి ఈ ఇంకు చుక్కను అధికారులు పెడతారు. పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఈ గుర్తు పూస్తారు. వేలి గోరుతోపాటు చర్మానికి పూసిన ఈ సిరా చుక్క త్వరగా చెరపడానికి వీలుపడదు. 15 నుంచి 30 సెకండ్లలో ఆరిపోతుంది. అయితే, ఇది కొద్దిరోజులు మాత్రమే మన వేలిపై అలానే ఉంటుంది. నెమ్మదిగా నెల లేదా రెండు నెలలకు పూర్తిగా చెరిగిపోతుంది. అయితే, ఓ మహిళకు మాత్రం ఏళ్లతరబడి ఆ గుర్తు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఇది ఆమెకు ఓ పెద్ద తలనొప్పిగా మారింది.
కేరళ (Kerala)కు చెందిన ఉష (Usha) అనే 62 ఏళ్ల మహిళ 2016లో ఓటేసింది. ఆ సందర్భంగా వేలిపై వేసిన సిరా గుర్తు మాత్రం ఎన్ని రోజులకీ చెరిగిపోవడం లేదు. అనేక రకాల సబ్బులు, ద్రావణాలను ఉపయోగించినా లాభం లేదట. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో ఓటేసేందుకు వెళ్తే వేలిపై గుర్తు చూసి ఓటేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతించలేదు. అయితే, పోలింగ్ బూత్‌లోని ఏజెంట్లు అసలు విషయం చెప్పడంతో చివరికి ఓటేసేందుకు అనుమతించారు. ఇక 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉష ఆ ఇంకు గుర్తు కారణంగా ఓటేసేందుకే వెళ్లలేదు. దాదాపు తొమ్మిదేళ్లయినా తన ఎడమచేతి చూపుడు వేలికి వేసిన సిరా గుర్తు ఇప్పటికీ చెరిగిపోలేదు. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే ఇబ్బంది తలెత్తుతుందని గ్రహించిన ఉష.. ఈ విషయాన్ని ప్రచారానికి వచ్చిన ఓ నాయకుడి చెప్పింది. అతను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు సమస్యను పరిష్కరించి ఉషను ఓటేసేందుకు అనుమతించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
Also Read..
Elections | ఓటు వేసినప్పుడు రాసే సిరా గుర్తు ఎవరికైనా అందుబాటులో ఉంటుందా?
Badrinath Temple | తెరుచుకున్న బద్రినాథ్ ఆలయ తలుపులు.. పోటెత్తిన భక్తులు
Telugu Students | అమెరికాలో విషాదం.. జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి