Telugu Students | అమెరికాలో తెలుగు విద్యార్థుల (Telugu Students) వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలువురు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మరణించడం కలచివేస్తోంది. తాజాగా ఇద్దరు విద్యార్థులు జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
ఇద్దరు తెలుగు విద్యార్థులు లక్కిరెడ్డి రాకేశ్‌రెడ్డి (23), రోహిత్ మణికంఠ రేపాల (25) అమెరికాలోని ఆరిజోనా విశ్వవిద్యాలయంలో (Arizona university) చదువుతున్నారు. తమ చదువు విజయవంతంగా పూర్తి చేసి ఇటీవలే ఎంఎస్ పట్టా కూడా పొందారు. ఈ శుభ సందర్భంగా ఈనెల 8వ తేదీన వీరు తమ స్నేహితులతో కలిసి ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతం (Fossil Creek Water Falls) వద్దకు వెళ్లారు. అక్కడ రాకేశ్, రోహిత్‌లు ప్రమాదవశాత్తూ జపాతంలో మునిగిపోయారు. గమనించిన స్నేహితులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జలపాతం వద్దకు చేరుకొని గాలింపు చేపట్టగా వారి ఆచూకీ లభించలేదు. మరుసటిరోజు గజఈతగాళ్ల సాయంతో గాలించగా.. ఇద్దరి మృతదేహాలు లభించాయి.
మృతుల్లో రాకేశ్ రెడ్డి.. ఖమ్మం నగరానికి చెందిన మాంటిస్సోరి, తెలంగాణ నారాయణ పాఠశాలల అధినేతల్లో ఒకరైన లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పద్మ దంపతుల ఏకైక కుమారుడిగా గుర్తించారు. వీరి మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read..
Pollution | కాలుష్యానికి ‘కొత్త’ కళ్లెం.. సరికొత్త పదార్థాన్ని కనుగొన్న యూకే, చైనా శాస్త్రవేత్తలు
Obesity | ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు.. 40 శాతం క్యాన్సర్ కేసులు శరీర బరువుతో ముడిపడి ఉన్నవే
Afghanistan | అఫ్ఘన్‌లో ఆకస్మిక వరదలు.. 300 మంది మృతి