Telangana | మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బెట్టింగ్‌లకు అలవాటు పడి డబ్బులను పోగొడుతున్నాడని కన్న కొడుకునే ఓ తండ్రి దారుణంగా కొట్టి చంపాడు.
వివరాల్లోకి వెళ్తే చిన్న శంకరంపేట మండలం బగిరాత్‌పల్లికి చెందిన సత్యనారాయణ కొడుకు ముకేశ్ కుమార్ (28) రైల్వేలో పనిచేస్తున్నాడు. మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ ముకేశ్ జల్సాలకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్‌లు ఆడుతూ ఉన్న డబ్బులను పోగొట్టాడు. ఈ విషయం తెలిసి సత్యనారాయణ ఎన్నిసార్లు వారించినా ముకేశ్ వినిపించుకోలేదు. పైగా 2 కోట్ల వరకూ బెట్టింగ్‌లో పోగొట్టాడు. దీంతో ఆవేశానికి గురైన సత్యానారాయణ.. ఐరన్ రోడ్‌తో ముకేశ్‌ను దారుణంగా కొట్టి చంపాడు.