Joe Biden | రసాయన ఆయుధాలను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రకటించిన అధ్యక్షుడు బైడెన్
Joe Biden | అగ్రరాజ్యం అమెరికా తన వద్ద ఉన్న దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల (chemical weapons) నిల్వలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) శుక్రవారం ప్రకటించారు.
Joe Biden | అగ్రరాజ్యం అమెరికా తన వద్ద ఉన్న దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల (chemical weapons) నిల్వలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) శుక్రవారం ప్రకటించారు. అమెరికా తన చివరి రసాయన ఆయుధాలను సురక్షితంగా ధ్వంసం చేసిందని ఓ ప్రకటనలో వెల్లడించారు.
‘30 సంవత్సరాలకు పైగా మా వద్ద పోగై ఉన్న రసాయన ఆయుధాల నిల్వలను తొలగించడానికి యూఎస్ అవిశ్రాంతిగా పనిచేసింది’ అని వైట్ హౌస్ (White House) విడుదల చేసిన ప్రకటనలో బైడెన్ తెలిపారు. ‘ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ రసాయన ఆయుధాల నిల్వలలో ఉన్న చివరి మందుగుండు సామగ్రిని సురక్షితంగా ధ్వంసం చేసిందని ప్రకటించడానికి గర్వపడుతున్నాను. రసాయనిక ఆయుధాలు లేని ప్రపంచం దిశగా ఓ అడుగు ముందుకేశాం’ అని బైడెన్ పేర్కొన్నారు.
కెంటుకీలోని యుఎస్ ఆర్మీ ఫెసిటిలీ బ్లూ గ్రాస్ ఆర్మీ డిపోలో ఉన్న చివరి బ్యాచ్ 500 టన్నుల ప్రాణాంతక రసాయన ఆయుధాలను ఇటీవలే యూఎస్ ధ్వంసం చేసింది. పలు దశాబ్ధాలుగా యూఎస్ లో ఉన్న మస్టర్డ్ గ్యాస్, వీఎక్స్ అండ్ సారిన్ నర్వ్ ఏజెంట్స్, బ్లిస్టర్ ఏజెంట్స్ వంటి ప్రమాదకర రసాయన ఆయుధాలను సురక్షితంగా నాశనం చేసింది.
కాగా, కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ (Chemical Weapons Convention) 1993లో అంగీకరించబడింది. ఈ ఒప్పందం 1997లో అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం యూఎస్ తన వద్ద ఉన్న రసాయన ఆయుధాలన్నింటినీ నాశనం చేయడానికి ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఈ ఒప్పందం ప్రకారం అన్ని దేశాలు ఇప్పటకే తమ వద్ద ఉన్న రసాయన ఆయుధాలు ధ్వంసం చేసినట్లు రసాయన ఆయుధాల నిషేధ సంస్థ (OPCW) అధిపతి ఫెర్నాండో అరియాస్ ఈ ఏడాది మేలో తెలిపారు. ఒక్క అమెరికా మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. తాజాగా అమెరికా కూడా రసాయన ఆయుధాలను ధ్వంసం చేసింది. దీంతో కెమికల్ వెపన్స్ కన్వెన్షన్‌పై సంతకాలు చేసిన దేశాల్లో రసాయనిక ఆయుధాలు పూర్తిగా తొలగించిన చివరి దేశంగా ప్రస్తుతం అగ్రరాజ్యం నిలిచింది. అయితే, కొన్ని దేశాలు తమ వద్ద గోప్యంగా ఈ ఆయుధాలు నిల్వ చేసుకున్నట్టు సమాచారం.
ఈ ఆయుధాల వినియోగంతో కలిగే దారుణాలు ఎలా ఉంటాయో మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచానికి తెలిసి వచ్చింది. అనంతరం, అనేక దేశాలు తమ వద్ద ఉన్న కెమికల్ వెపన్స్ పూర్తిగా తొలగించేందుకు ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ, కొన్ని దేశాలు వీటి అభివృద్ధి కోసం పరిశోధనలు చేయడం, మరిన్ని ఆయుధాలను పోగేసుకోవడం చేశాయన్న ఆరోపణలు ఉన్నాయి.
రసాయన ఆయుధాల నిషేధ సంస్థ (Organization for the Prohibition of Chemical Weapons) ప్రకారం.. 70,000 టన్నులకు పైగా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆయుధాలు ఇప్పటి వరకూ నాశనం చేయబడ్డాయి. యూఎస్ ఆయుధ నియంత్రణ సంఘం ప్రకారం.. 1990లో యునైటెడ్ స్టేట్స్ దాదాపు 28,600 టన్నుల రసాయన ఆయుధాలను కలిగి ఉంది. రష్యా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద రసాయన ఆయుదాలు కలిగి ఉన్న రెండో దేశంగా నిలిచింది. అయితే రష్యా తన వద్ద ఉన్న నిల్వలను 2017లోనే ధ్వంసం చేసేసింది. ఇక అమెరికా వద్ద ఏప్రిల్ 2022 నాటికి 600 టన్నుల కంటే తక్కువ రసాయన ఆయుధాలు మిగిలి ఉన్నాయి. తాజాగా వాటిని ధ్వంసం చేసేసింది.
Also Read..
Vignesh Shivan | నయన్ దంపతులపై కేసు నమోదు.. ఆస్తి కాజేశారంటూ ఫిర్యాదు..?
snakes | ఒకే ఇంట్లో 60 పాములు.. బీహార్ లో ఘటన
Rahul Gandhi | పొలంలోకి దిగి.. ట్రాక్టర్‌తో దుక్కి దున్నిన రాహుల్ గాంధీ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

