Adipurush writer | ఆదిపురుష్ వివాదం.. క్షమాపణలు చెప్పిన డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్
Adipurush writer| ఆదిపురుష్ (Adipurush) సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ (Manoj Muntashir) బేషరుతగా క్షమాపణలు కోరారు. సినిమాలోని డైలాగ్స్ వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని తాను అంగీకరిస్తున్నట్లు చెప్పారు.
Adipurush writer | భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) టైటిల్ పాత్రలో ఓంరౌత్ (Om Raut) రూపొందించిన చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తీవ్ర నిరాశ పరిచింది. చిత్రానికి తొలిరోజు భారీ ఓపెనింగ్స్ లభించినప్పటికీ అదే స్థాయిలో విమర్శలొచ్చాయి. హద్దుమీరిన సృజనాత్మక స్వేచ్ఛతో రామాయణ గాథను వక్రీకరించారని, సినిమాలో ఆధ్యాత్మిక అంశాలు పూర్తిగా కొరవడ్డాయని, గ్రాఫిక్స్‌తో కనికట్టు చేసే ప్రయత్నం జరిగిందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్ మొదలుకొని స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే, సంభాషణలు ..ఇలా ప్రతీ అంశంలో సినిమా లోపభూయిష్టంగా ఉందని సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ప్రత్యేకించి సినిమాకు మాటలు రాసిన (Adipurush writer) మనోజ్ ముంతాషిర్ (Manoj Muntashir)పై జనం మండిపడుతున్నారు. దీనిపై సోషల్ మీడియా, పలు ఇంటర్వ్యూ ల్లో అనేక వివరణలు ఇచ్చిన మనోజ్.. తాజాగా బేషరతుగా క్షమాపణ (Apologises) చెప్పారు. ఆదిపురుష్ చిత్రం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందన్న విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు శనివారం తెలిపారు.
‘ఆదిపురుష్ వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. చేతులు జోడించి (ముకుళిత హస్తాలతో) నేను బేషరతుగా క్షమాపణలు కోరుతున్నాను. ప్రభు బజరంగ్ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి, మన పవిత్రమైన సనాతన, మన గొప్ప దేశానికి సేవ చేయడానికి శక్తిని ప్రసాదించుగాక’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
మైథలాజికల్ సినిమాగా రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతీసనన్ సీతగా కనిపించింది. లంకాధిపతి రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించాడు. ఓంరౌత్ దర్శకుడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేసింది. ఈ చిత్రం జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
मैं स्वीकार करता हूँ कि फ़िल्म आदिपुरुष से जन भावनायें आहत हुईं हैं.
अपने सभी भाइयों-बहनों, बड़ों, पूज्य साधु-संतों और श्री राम के भक्तों से, मैं हाथ जोड़ कर, बिना शर्त क्षमा माँगता हूँ.
भगवान बजरंग बली हम सब पर कृपा करें, हमें एक और अटूट रहकर अपने पवित्र सनातन और महान देश की…— Manoj Muntashir Shukla (@manojmuntashir) July 8, 2023
Also Read..
Vignesh Shivan | నయన్ దంపతులపై కేసు నమోదు.. ఆస్తి కాజేశారంటూ ఫిర్యాదు..?
Joe Biden | రసాయన ఆయుధాలను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రకటించిన అధ్యక్షుడు బైడెన్
snakes | ఒకే ఇంట్లో 60 పాములు.. బీహార్ లో ఘటన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

