ముంబై లోకల్ ట్రెయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముంబై లోకల్ రైళ్లలో రోజూ లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. అందుకే ఆ రైళ్లలో ఎప్పుడూ రద్దీ ఉంటూనే ఉంటుంది. ముంబైలోని రైల్వే స్టేషన్లలో లోకల్ రైళ్లు కొద్దిసేపు మాత్రమే ఆగుతాయి. ఆ సమయంలోనే రైలు ఎక్కాల్సి ఉంటుంది. క్షణం లేట్ అయినా రైలు ఎక్కలేం.
అలా కదిలిన రైళ్లు ఎక్కుతూ ఎందరో మృత్యువాత పడ్డారు. ఎందరో గాయాలపాలయ్యారు. కొందరిని పోలీసులు కాపాడగలిగారు. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని సాండ్హర్స్ట్ రోడ్ రైల్వే స్టేషన్లో లోకల్ రైలు ఎక్కబోయిన ఓ మహిళ కింద పడిపోయింది. 50 ఏళ్ల వయసు ఉన్న ఓ మహిళ.. రైలు ఎక్కేందుకు స్టేషన్కు వచ్చింది. అప్పటికే లోకల్ రైలు కదిలింది.
వెంటనే ఎక్కేందుకు ప్రయత్నించి కింద పడిపోయింది. ప్లాట్ఫామ్, ట్రెయిన్ మధ్యలో పడి ట్రాక్ కింద పడిపోతున్న మహిళను చూసిన లేడీ కానిస్టేబుల్ వెంటనే తనను పైకి లాగింది. దీంతో ఆ మహిళ ప్రాణాలు నిలిచాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ మహిళను కాపాడిన మహిళా పోలీసుపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH | Maharashtra: Railway Protection Force (RPF) constable Sapna Golkar saves a 50 year-old woman from falling into the gap between platform and train while she was boarding the running train at Sandhurst Road railway station on Thursday. pic.twitter.com/XkTZGODpYQ
— ANI (@ANI) October 21, 2021
BTW, sharp reflexes by the woman constable! Superb work!
— Too Opinionated (@ToooOpinionated) October 21, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Spider inside Woman’s Ear : మహిళ చెవిలో దూరిన సాలీడు..
70 ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వృద్ధురాలు..
Viral Video : ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాము.. దీన్ని మోయడానికి క్రేన్నే తీసుకొచ్చారు
Driverless bike : డ్రైవర్లెస్ బైక్ వచ్చేసింది.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూశారా?
విమానం నుంచి పడిపోయిన మానవ వ్యర్థాలు.. షాకైన తోట యజమాని