Driverless bike : డ్రైవర్‌లెస్ బైక్ వచ్చేసింది.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూశారా?
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూశారా? | డ్రైవర్‌లెస్ కారు అనేది ఇప్పటికే కొన్ని చోట్ల సక్సెస్ అయింది. టెస్లా కంపెనీ నుంచి కూడా
డ్రైవర్‌లెస్ కారు అనేది ఇప్పటికే కొన్ని చోట్ల సక్సెస్ అయింది. టెస్లా కంపెనీ నుంచి కూడా డ్రైవర్‌లెస్ కార్లు వచ్చాయి. టెస్లా ఫౌండర్ ఎలోన్ మస్క్ కూడా డ్రైవర్‌లెస్ కార్లను ప్రపంచమంతా తీసుకొచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈనేపథ్యంలో డ్రైవర్‌లెస్ బైక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఎలోన్ మస్క్.. డ్రైవర్‌లెస్ కార్లు తర్వాత.. ముందు ఇండియాలో వచ్చిన డ్రైవర్‌లెస్ బైక్‌ను చూడు.. అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

ఆ వీడియో ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా కంటపడింది. దీంతో వెంటనే ఆ వీడియోను షేర్ చేస్తూ.. 1972లో వచ్చిన బాలీవుడ్ సినిమా పరిచయ్ నుంచి ముసాఫిర్ హూన్ యారూన్ అనే పాటను గుర్తు చేసుకుంటూ.. డ్రైవర్ లేడు.. నేను ఎక్కడికి పోతున్నానో తెలియదు.. అంటూ క్యాప్షన్ పెట్టి ఆ వీడియోను షేర్ చేశాడు. ఇంతకీ ఆ వీడియో గురించి చెప్పాలంటే ఓ వ్యక్తి బైక్ వెనుక కూర్చొని ఉంటాడు. బైక్ స్పీడ్‌లో వెళ్తూ ఉంటుంది. ముందు ఎవ్వరూ ఉండరు. డ్రైవర్‌లెస్ కారులా.. డ్రైవర్‌లెస్ బైక్ అన్నమాట. ఇంతకీ ఆ బైక్ ఎలా వెళ్లింది? వెనుక కూర్చున్న వ్యక్తి ఆ బైక్‌ను ఎలా మేనేజ్ చేశాడు అనేది తెలియక నెటిజన్లు తలగోక్కుంటున్నారు.
Love this…Musafir hoon yaaron… na chalak hai, na thikaana.. https://t.co/9sYxZaDhlk
— anand mahindra (@anandmahindra) October 20, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
విమానం నుంచి పడిపోయిన మానవ వ్యర్థాలు.. షాకైన తోట యజమాని
‘అందరి పిల్లలు తాగుతారు’.. వైరల్ అవుతున్న ఎమ్మెల్యే వీడియో..!
Viral video: ఉప్పొంగి ప్రవహిస్తున్న గౌలా నది.. నీటి నడుమ చిక్కుకున్న ఏనుగు..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

