#RejectZomato : హిందీ రాకుంటే డబ్బులు రిఫండ్ చేయం.. కస్టమర్ ఏజెంట్ ఆన్సర్ పై రచ్చ.. క్షమాపణలు చెప్పిన జొమాటో
హిందీ రాకుంటే డబ్బులు రిఫండ్ చేయం | ఒక్కోసారి చిన్న చిన్ని విషయాలు పెద్దగా అవుతాయి. అవే కొంప ముంచుతాయి. తాజాగా అదే జరిగింది. ఓ కస్టమర్
ఒక్కోసారి చిన్న చిన్ని విషయాలు పెద్దగా అవుతాయి. అవే కొంప ముంచుతాయి. తాజాగా అదే జరిగింది. ఓ కస్టమర్ కు హిందీ రాకపోవడం చివరకు జొమాటోకు పెద్ద చిక్కులు తీసుకొచ్చింది. వికాస్ అనే జొమాటో కస్టమర్ చేసిన ఆర్డర్ డెలివరీ కాకపోవడంతో.. వెంటనే కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి డబ్బులు రిఫండ్ చేయాలని అడిగాడు. జొమాటో ఎగ్జిక్యూటివ్ రెస్టారెంట్ కు కాల్ చేసినప్పటికీ ఎగ్జిక్యూటివ్ కు తమిళం రాకపోవడంతో.. రెస్టారెంట్ సిబ్బందితో సరిగ్గా మాట్లాడలేకపోయాడు. కస్టమర్ కు కూడా హిందీ రాకపోవడంతో.. హిందీ రాకపోవడం వల్ల.. డబ్బులు రిఫండ్ చేయలేమని.. రెస్టారెంట్ తో కాంటాక్ట్ చేయలేకపోయామని చెప్పారు.

దీంతో తమిళనాడులో జొమాటా ఆపరేట్ చేస్తున్నప్పుడు తమిళం తెలిసిన కస్టమర్ ఏజెంట్ ను నియమించుకోవాలి కదా అని కస్టమర్ చెప్పడంతో.. హిందీ మన నేషనల్ లాంగ్వేజ్. అది ఖచ్చితంగా అందరికీ వచ్చి ఉండాలి.. అని కస్టమర్ కేర్ సిబ్బంది చెప్పడం.. ఆ తర్వాత అది ట్విట్టర్ లో ట్రెండింగ్ టాపిక్ కావడంతో కస్టమర్ ఎగ్జిక్యూటివ్, జొమాటో ఆ కస్టమర్ కు క్షమాపణలు చెప్పారు.
Vanakkam Vikash, we apologise for our customer care agent's behaviour. Here's our official statement on this incident. We hope you give us a chance to serve you better next time.
— zomato (@zomato) October 19, 2021
Pls don't #Reject_Zomato ♥️ https://t.co/P350GN7zUl pic.twitter.com/4Pv3Uvv32u
ఆ కస్టమర్.. ట్విట్టర్ లో కస్టమర్ కేర్ రెస్పాన్స్ ను ట్వీట్ చేయడంతో అది కాస్త దుమారం రేపింది. నాకు హిందీ రానందుకు డబ్బులు రిఫండ్ చేయరట. ఇండియన్ అయినందుకు నాకు హిందీ రావాలట. అతడికి తమిళం రానందుకు నాదే తప్పట. కస్టమర్ తో మాట్లాడే విధానం ఇదేనా.. అంటూ స్క్రీన్ షాట్స్ కూడా పెట్టడంతో నెటిజన్లు కూడా ఆ కస్టమర్ కు మద్దతు పలికారు. రిజెక్ట్ జొమాటో హ్యాష్ టాగ్ ను కూడా ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన జొమాటో ఆ కస్టమర్ కు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసింది. దీంతో ఆ దుమారం కాస్త సద్దుమణిగింది.
An ignorant mistake by someone in a support centre of a food delivery company became a national issue. The level of tolerance and chill in our country needs to be way higher than it is nowadays. Who's to be blamed here?
— Deepinder Goyal (@deepigoyal) October 19, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
‘అందరి పిల్లలు తాగుతారు’.. వైరల్ అవుతున్న ఎమ్మెల్యే వీడియో..!
Tandoori Roti : దాబాలో తందూరీ రోటీ చేస్తూ దాని మీద ఉమ్మేశాడు.. వీడియో వైరల్
6 కిలోల శిశువుకు జన్మనిచ్చిన మహిళ.. పుట్టగానే ఆ పిల్లాడు ఎలా ఉన్నాడో చూడండి
Squid Game Parody : స్క్విడ్ గేమ్ పేరడీ వీడియో చూశారా? చూస్తే నవ్వు ఆపుకోలేరు
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

