మామూలుగా పాములు ఎంత పెద్దగా ఉంటాయి. మా.. అంటే 6 అడుగులు ఉండొచ్చు. కొండ చిలువలు మాత్రం కాస్త పెద్దగా ఉంటాయి. ఎంత పెద్దగా ఉన్నా.. వాటిని మోయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఈ పామును చూడండి. ఈ పాము ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాము అట. దీన్ని లేపడానికి పెద్ద క్రేన్‌నే పట్టుకొచ్చారు. ఆ క్రేన్‌తో పెద్ద పామును పైకి లేపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కరేబియన్ దేశం డొమినికాలో చోటు చేసుకుంది.
చూడటానికి కొండచిలువలా ఉన్న ఈ పామును బతికి ఉండగానే క్రేన్‌తో బంధించి పైకి లేపారు. దాన్ని చూసిన స్థానికులు నోరెళ్లబెట్టారు. వామ్మో.. ఎంత పెద్ద పాము అంటూ ఆశ్యర్యపోయారు. సాధారణంగా కరేబియన్ దీవుల్లో 13 ఫీట్ల పొడవు ఉన్న పాములు కూడా ఉంటాయట. ఇది అంతకంటే పొడవుగా ఉండి చాలా పెద్దగా ఉండటంతో దీన్ని చూసిన స్థానికులు వెంటనే రెస్క్యూ టీమ్‌కు సమాచారం ఇవ్వడంతో ఇదిగో ఇలా క్రేన్‌తో ఆ పామును అక్కడి నుంచి తొలగించారు.