మిడిల్ ఫింగర్ గురించి తెలుసు కదా. మిడిల్ ఫింగర్‌ను ఎవరి వైపు అయినా చూపించడం నేరం. అది పెద్ద బూతు కింద పరిగణిస్తారు. నిజానికి మిడిల్ ఫింగర్ చూపించే అలవాటు ఎక్కువ యూఎస్‌లో ఉంటుంది. అక్కడ కూడా దీన్ని నేరంగానే పరిగణిస్తారు. దాన్ని చూపిస్తే.. బూతు మాట్లాడినట్టే. అందుకే.. ఒక్కోసారి మిడిల్ ఫింగర్ చూపించిన వాళ్లపై సీరియస్ అవుతుంటారు. పెద్ద పెద్ద గొడవలే జరుగుతుంటాయి.

ఇలాగే.. ఓ మహిళకు మిడిల్ ఫింగర్ చూపించిన ఓ వ్యక్తికి కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. 33 ఏళ్ల అనికేత్ పాటిల్ కారు డ్రైవ్ చేస్తు వెళ్తూ.. హుగెస్ రోడ్ వద్ద ఓ మహిళతో గొడవకు దిగాడు. తన కొడుకు ముందే.. ఆ మహిళకు మిడిల్ ఫింగర్ చూపించాడు. ఈ ఘటన 2018 సెప్టెంబర్‌లో చోటు చేసుకుంది.
రెడ్ కారులో వెళ్తున్న అనికేత్.. ఆ మహిళ కారును ఓవర్ టేక్ చేసే సమయంలో రాష్‌గా డ్రైవ్ చేశాడు. ఓవర్ స్పీడ్‌తో ముందుకు వెళ్లిపోయాడు. సిగ్నల్ వద్ద కారు ఆగినప్పుడు.. ఆ మహిళ కారును రాష్‌గా డ్రైవ్ చేయొద్దని సూచించింది. దీంతో కారు విండో తీసి.. ఆ మహిళకు మిడిల్ ఫింగర్ చూపించాడు డ్రైవర్. అంతే కాదు.. కారు దిగి.. తనను బండ బూతులు తిట్టాడు. ఆ తర్వాత తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఆ మహిళ కొడుకు తన కారుతో అడ్డగించి.. అతడిని పట్టుకొని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించడంతో.. అతడిని గామ్దేవీ పోలీస్ స్టేషన్‌కు తలరించి.. పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు.
ఆ కేసు అప్పటి నుంచి కోర్టులో పెండింగ్‌లో ఉంది. తాజాగా ఆ కేసుకు సంబంధించిన తీర్పును కోర్టు వెల్లడించింది. అనికేత్ ఒక మహిళ ప్రాథమిక హక్కులను హరించేలా ప్రవర్తించినందుకు.. పబ్లిక్‌లో తనపై అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
mini bengal | తెలంగాణలో మినీ బెంగాల్.. కట్టుబొట్టూ అంతా ఉత్తరాది స్టైలే !!
లక్షల విలువ చేసే గోల్డ్ నెక్లెస్‌ను మింగిన ఆవు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
70 ఏళ్ల వయసులో రోడ్డు పక్కన ‘పోహా’ అమ్ముతూ జీవనం.. ఈ వృద్ధ జంట కష్టాలు తెలిస్తే కన్నీళ్లాగవు
Train | పెరుగు కోసం రైలు ఆపేసిన డ్రైవర్.. వీడియో వైరలవడంతో..