ఈరోజుల్లో ఫేస్బుక్ వాడటం అనేది కామన్. ఇంట్లో టైమ్‌పాస్ కాకపోతే వాడితే ఓకే కానీ.. ఆఫీసుల్లో పనిచేయకుండా ఫేస్‌బుక్‌లలో గంటలు గంటలు గడిపితే ఎలా ఉంటది.. బాస్ నుంచి తిట్లు తప్పవు. కానీ.. ఎప్పటి నుంచో ఉన్న ఆ అలవాటు ఒక్కసారే పోవాలంటే పోదు కదా. అందుకే ఓ వ్యక్తి ఏం చేశాడంటే.. ఓ యువతినే నియమించుకున్నాడు. కేవలం తనను చెంపదెబ్బలు కొట్టేందుకే యువతికి ఉద్యోగం ఇచ్చాడు. చదవడానికే షాకింగ్‌గా ఉంది కదా. పదండి.. తెలుసుకుందాం.
మనీశ్ సేథి.. ఇండియనే కానీ.. యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కోలో కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. తన ఆఫీసు సమయంలో ఎక్కువగా ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నాడట. దీంతో పని అంతా ఆగిపోతోందట. ఇలా అయితే కష్టం అని అనుకున్నాడో ఏమో కానీ.. తాను ఆఫీసు టైమ్‌లో ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చెంప చెళ్లుమనిపించాలంటూ ఓ యువతికి ఉద్యోగం ఇచ్చాడు.
అనుకున్నట్టుగానే ఆఫీసులో తన పక్కనే ఆ యువతికి సీటు ఇచ్చాడు. తను ఫేస్బుక్ ఓపెన్ చేయగానే.. ఆ యువతి ఏ మాత్రం ఆలోచించకుండా అతడి చెంపచెళ్లుమనిపించింది. దాన్ని తన యూట్యూబ్ చానెల్లో షేర్ చేశాడు. ఈ ఘటన జరిగింది 2012లో.
కానీ.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్.. ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. ఆ వీడియోకు టెస్లా అధినేత ఎలోన్ మస్క్ రిప్లయి ఇచ్చాడు. రెండు ఫైర్ ఎమోజీలను షేర్ చేశాడు. దీంతో ఆ వ్యక్తి కూడా వెంటనే ఆ ట్వీట్‌కు రిప్లయి ఇచ్చి.. నిజంగా ఎలోన్ మస్కే ఈ ట్వీట్‌కు రిప్లయి ఇచ్చాడా? అంటూ ఆశ్చర్యపోయాడు. దీంతో ఆ వీడియో, ట్వీట్లు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
🔥🔥
— Elon Musk (@elonmusk) November 10, 2021
I'm the guy in this picture. Is @elonmusk giving me two emojis the highest I'll ever reach? Is this my icarus flying too close to the sun moment? Was that implied by the fire symbols elon posted? Time will tell.
— Maneesh Sethi (@maneesh) November 10, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
Mukesh Ambani | స్పోర్ట్స్.. ఆతిథ్యంపై ముకేశ్ అంబానీ క్రేజీ.. అందుకే లండన్ ఎస్టేట్ సొంతం?!