Viral Video | సాధారణంగా రైతులు (Farmer) మార్కెట్లకు ఆటో, వ్యాన్, బైక్, రిక్షాల్లో తమ ఉత్పత్తులను తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. అయితే, కేరళ (Kerala)కు చెందిన ఓ రైతు మాత్రం లగ్జరీ కారులో మార్కెట్‌కు వెళ్లి.. తన పంటను అమ్ముకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
సుజీత్ అనే రైతు దాదాపు పదేళ్లుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తాను పండించిన ఆకు కూరలు, కూరగాయలను రోడ్డుపక్కన మార్కెట్ (Roadside Market)కు తీసుకెళ్లి స్వయంగా విక్రయిస్తున్నాడు. అయితే, అతడు ఎవరూ ఊహించని విధంగా ఆడీ ఏ4 (Audi A4) లగ్జరీ సెడాన్‌లో ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఏదో బిజినెస్ మ్యాన్ లెవెల్లో పంచ కట్టుకుని వచ్చిన ఆ రైతు.. మార్కెట్ వద్దకు రాగానే తన పంచను తీసేసి షాట్‌తో రైతుగా మారిపోతాడు. తను తెచ్చిన ఆకుకూరలను మార్కెట్లో ఓ దగ్గర ఉంచి విక్రయిస్తాడు. అమ్మడం పూర్తవగానే మళ్లీ పంచ కట్టుకుని తన సెడాన్‌లో తిరిగి వెళ్లిపోతాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
Also Read..
Donald Trump | దారినే ఆయన సరిగా గుర్తించలేరు.. బైడెన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
Elon Musk | అసాల్ట్ రైఫిల్‌తో ఫైరింగ్.. యాక్షన్ హీరో లెవల్లో మస్క్.. వీడియో