UP Teachers | పాఠశాలలోనే ఇన్‌స్టా రీల్స్.. లైక్స్, కామెంట్స్ చేయాలంటూ విద్యార్థులపై ఒత్తిడి.. యూపీ టీచర్స్ నిర్వాకం
UP Teachers | సాధారణంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు చదువుకోమని ఒత్తిడి తీసుకురావడం మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ ఉపాధ్యాయులు మాత్రం వారి సోషల్ మీడియా అకౌంట్స్‌లోని రీల్స్‌కు లైక్స్, షేర్ చేయాలంటూ బలవంతం చేస్తున్నారు.
UP Teachers | ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ‘రీల్స్’ (Reels) చేస్తూ గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇలా వీడియోలు పోస్టు చేస్తూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా (Social Media Influencer) గుర్తింపు పొంది రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకుంటున్నారు. అయితే, కొన్ని కొన్ని సార్లు వారు చేసే రీల్స్, వీడియోస్ వారికి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కు చెందిన కొందరు టీచర్లకు కూడా ఇదే పరిస్థితి తలెత్తింది.
సాధారణంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు చదువుకోమని ఒత్తిడి తీసుకురావడం మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ ఉపాధ్యాయులు మాత్రం వారి సోషల్ మీడియా అకౌంట్స్‌లోని రీల్స్‌కు లైక్స్, షేర్ చేయాలంటూ బలవంతం చేస్తున్నారు. అమ్రోహా జిల్లా (Amroha district)లోని కొందరు టీచర్లు పాఠశాల (School)లోనే రీల్స్ రూపొందిస్తున్నారు. వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టా (Instagram) అకౌంట్లో పోస్టు చేసి.. ఆ పోస్టులకు లైక్స్, షేర్ చేయాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాదు వారి ఖాతాలను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటూ బలవంతం చేస్తున్నారు.
పాఠశాలకు వచ్చింది మొదలు విద్యార్థులకు చదువు చెప్పటం పక్కన పెట్టి.. కెమెరా పట్టి రీల్స్ చేయడంకోసమే తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఓ టీచర్ రీల్స్ చేస్తుంటే మరో టీచర్ దానిని కెమెరాతో షూట్ చేస్తున్నారు. వాటిని ఇన్‌స్టా అకౌంట్స్‌లో పోస్టు చేసి.. లైక్స్, షేర్స్ చేయాలంటూ పాఠశాలలోని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘రవిపూజా’ అనే ఖాతాలో రీల్స్ పోస్టు చేస్తున్న టీచర్ స్కూల్లోనే వాటిని చిత్రీకరిస్తున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సదరు టీచర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పాఠశాలలో రీల్స్ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్లో రీల్స్ రికార్డ్ చేస్తున్న టీచర్లను అంబికా గోయల్, పూనమ్ సింగ్, నీతూ కశ్యప్‌గా గుర్తించారు. అయితే, విద్యార్థులు చేస్తున్న ఆరోపణలను సదరు టీచర్లు ఖండించారు. చదువుల్లో భాగంగానే పిల్లలు నేర్చుకుంటారని కొన్నిసార్లు మాత్రం వీడియోలు చేసినట్టు చెప్తుండటం గమనార్హం.
Also Read..
Parineeti-Raghav Chadha | రాఘవ్-పరిణీతి వెడ్డింగ్ వీడియో చూశారా..?
Elon Musk | అసాల్ట్ రైఫిల్‌తో ఫైరింగ్.. యాక్షన్ హీరో లెవల్లో మస్క్.. వీడియో
Heavy Rains | న్యూయార్క్ నగరాన్ని ముంచెత్తిన వరదలు.. ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

