Elon Musk | అసాల్ట్ రైఫిల్‌తో ఫైరింగ్.. యాక్షన్ హీరో లెవల్లో మస్క్.. వీడియో
Elon Musk | అమెరికన్ బిజినెస్ టైకూన్, టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఏం చేసినా విశేషమే. ఆయన సోషల్ మీడియాలో చిన్న పోస్టు చేసినా సరే అ ది క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. తాజాగా అసాల్ట్ రైఫిల్ (Assault Rifle)తో ఫైరింగ్ చేస్తున్న వీడియోను మస్క్ తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేశారు.
Elon Musk | అమెరికన్ బిజినెస్ టైకూన్, టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఏం చేసినా విశేషమే. ఆయన సోషల్ మీడియాలో చిన్న పోస్టు చేసినా సరే అ ది క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. తాజాగా అసాల్ట్ రైఫిల్ (Assault Rifle)తో ఫైరింగ్ చేస్తున్న వీడియోను మస్క్ తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేశారు. ‘50 క్యాలిబర్ బ్యారెట్ రైఫిల్‌తో హిప్ ఫైరింగ్ చేస్తున్నా’ అంటూ వీడియోకు క్యాప్షన్ జోడించారు. ఈ వీడియోలో మస్క్.. యాక్షన్ హీరో లెవల్లో ఫోజులిస్తూ ఫైరింగ్ చేస్తూ కనిపించారు. 26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కాగా, మస్క్ గతంలోనూ తుపాకీల ఫొటోలను నెట్టింట షేర్ చేసిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 22వ తేదీన ఆయన తన మంచం పక్కన టేబుల్‌పై సాఫ్ట్‌డ్రింక్స్, రెండు పిస్టల్స్ ఉన్న ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆ తుపాకులు నిత్యం తన మంచం పక్కనే ఉంటాయని అప్పట్లో ఆయన పేర్కొన్నారు.

Elon Musk Rifil
అంతకుముందు, మే 2022లో టెక్సాస్ (Texas) రాష్ట్రంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో జరిగిన కాల్పుల ఘటనపై కూడా మస్క్ స్పందించారు. అసాల్ట్ రైఫిల్ వినియోగంపై ఆంక్షలు విధించాలని అభిప్రాయపడ్డారు. ‘ఈ రైఫిల్ కొనుగోలుకు ప్రత్యేక పర్మిట్ విధానం అమలు చేయాలి. కొనుగోలుదారుడి గతం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాకే ఈ పర్మిట్ జారీ చేయాలి’ అని అభిప్రాయపడ్డారు. కాగా, ఆ కాల్పుల ఘటనలో ఏకంగా 19 మంది చిన్నారులు సహా మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అసాల్ట్ రైఫిల్‌తో స్కూల్లోకి వచ్చిన దుండగుడు చిన్నారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో వారంతా అక్కడికక్కడే మరణించారు.
Hip-firing my Barrett 50 cal pic.twitter.com/OkNnjWid0r
— Elon Musk (@elonmusk) September 30, 2023
Also Read..
Parineeti-Raghav Chadha | రాఘవ్-పరిణీతి వెడ్డింగ్ వీడియో చూశారా..?
Heavy Rains | న్యూయార్క్ నగరాన్ని ముంచెత్తిన వరదలు.. ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్
EPFO | పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. పెన్షన్ వివరాల సమర్పణకు మరో 3 నెలలు గడువు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

