Parineeti-Raghav Chadha | రాఘవ్-పరిణీతి వెడ్డింగ్ వీడియో చూశారా..?
Parineeti-Raghav Chadha | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) వివాహం గత ఆదివారం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వివాహం అయిన వారం రోజుల తర్వాత పరిణీతి పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా అభిమానులతో పంచుకుంది.
Parineeti-Raghav Chadha | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) వివాహం గత ఆదివారం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace)లో పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను పరిణీతి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే వివాహం అయిన వారం రోజుల తర్వాత పరిణీతి పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా అభిమానులతో పంచుకుంది. రాఘవ్ చద్దా కోసం ‘ఓ పియా..’ అనే పాటను ప్రత్యేకంగా రూపొందించినట్లు పరిణీతి వీడియోలో తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో వధూవరులు ఇద్దరూ ఎంతో సరదాగా, సంతోషంగా కనిపించారు.
రాఘవ్-పరిణీతి వివాహం ఈనెల 24వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, స్నేహితుల సమక్ష్యంలో రాఘవ్ తన ప్రేయసి పరిణీతి మెడలో మూడుముళ్లు వేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సహా పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫొటోలను కొత్త జంట సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
EPFO | పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. పెన్షన్ వివరాల సమర్పణకు మరో 3 నెలలు గడువు
INDIA Alliance | ఆర్జేడీ, జేడీయూ మధ్య సీట్ల పంపకంలో తకరారు.. ఇండియా కూటమి నేతల మధ్య సయోధ్య కుదిరేనా?
RS.2000 Notes | రూ.2000 నోట్ల మార్పిడికి నేటితో ముగియనున్న గడువు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

