RS.2000 Notes | రూ.2000 నోట్ల మార్పిడికి నేటితో ముగియనున్న గడువు
దేశ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ.2000 నోట్ల (RS.2000 Notes) మార్పిడి, డిపాజిట్లకు నేటితో గడువు ముగియనుంది. ఈ ఏడాది మే 19న 2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నోట్ల మార్పిడీకి సెప్టెంబర్ 30 (September 30) వరకు గడువు ఇచ్చింది.
న్యూఢిల్లీ: దేశ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ.2000 నోట్ల (RS.2000 Notes) మార్పిడి, డిపాజిట్లకు నేటితో గడువు ముగియనుంది. ఈ ఏడాది మే 19న 2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నోట్ల మార్పిడీకి సెప్టెంబర్ 30 (September 30) వరకు గడువు ఇచ్చింది. అది నేటితో ముగియనుంది. గడవును పొడిగించేది లేదని ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ఆదివారం నుంచి 2 వేల నోటు ఒక చరిత్రగా మిగిలిపోనుంది. అందువల్ల ఇప్పటికీ పెద్ద నోటను మార్పిడీ చేసుకోనివారు ఈరోజు సాయంత్రంలోగా ఎక్ఛేంజ్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చలామణీలో (Circulation) ఉన్నాయి. వాటిలో సెప్టెంబర్ 1 నాటికి 93 శాతం నోట్లు బ్యాంకుల్లో జమయ్యాయి. అంటే వీటి విలువ రూ.3.32లక్షల కోట్లు. మరో 7 శాతం అంటే రూ.24 వేల కోట్ల విలువైన నోట్లు వెనక్కి రావాల్సి ఉందని ఆర్బీఐ వెల్లడించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకు శాఖలు, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. అదేవిధంగా డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. ఒకేసారి రూ.20 వేల వరకు ఈ నోట్లను మార్చుకునే అవకాశం ఉంది. కాగా, రూ.2 వేల నోటును ఆర్బీఐ 2016 నవంబర్‌లో ప్రవేశపెట్టింది. అయితే 2018-2019లోనే ఈ నోట్ల ముద్రణను నిలిపివేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

