Vishwak Sen | మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, దర్శకుడిగా రూపొందిస్తున్న తాజా చిత్రం ‘కల్ట్’ టీజర్‌ను శనివారం హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. “ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ ఫిల్మ్” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్కి విశ్వక్ సేన్ రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చిత్రానికి ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్కు గుర్తింపుగా ఈ గిఫ్ట్ ఇస్తున్నట్లు విశ్వక్ తెలిపారు. ఈ సంఘటన టీజర్ లాంచ్ ఈవెంట్లో హైలైట్‌గా నిలిచింది. దీని ధర ముప్పై లక్షల వరకు ఉంటుందని సమాచారం. అయితే ఈ సినిమాకి రవి బస్రూర్ అద్భుతమైన సంగీతం అందించాడని చెప్పిన విశ్వక్ సేన్, నా సినిమాకి ఇలాంటి మంచి మ్యూజిక్ ఇస్తారని అస్సలు అనుకోలేదని అన్నారు. అందుకు కృతజ్ఞతగా ఈ వాచ్ ఇస్తున్నాను అని స్పష్టం చేశాడు.
ఆ వాచ్ తన ఫేవరేట్ వాచ్ అని, రెండేళ్లు వెయిట్ చేసి తెప్పించుకున్నాను. తర్వాత ఎప్పుడైన సినిమా చేయమని అడిగితే ఇది చూసైన మీరు చేయాలి అంటూ చెప్పుకొచ్చారు విశ్వక్. ఇక ఇంటెన్స్ పార్టీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న కల్ట్ చిత్రంలో గాయత్రీ హీరోయిన్గా నటిస్తోంది. దాదాపు 100 మంది కొత్త నటీనటులను ఈ సినిమాతో పరిచయం చేస్తున్నట్లు విశ్వక్ వెల్లడించారు. టీజర్ లాంచ్ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ, “చాలామంది నేను సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో గమనించనని అనుకుంటారు. కానీ ట్విట్టర్, రెడిట్ల్లో ఏం ట్రెండ్ అవుతుందో చూస్తూ ఉంటా. జనాలు ఏం కోరుకుంటున్నారు? ఏం మిస్ అవుతున్నారు? అన్నదాన్ని గమనించి, అన్నీ కలిపి తీసిన సినిమానే ‘కల్ట్’” అని చెప్పారు.
నేను ఫలక్‌నుమా దాస్ తీసే ముందు ఒక కసి, ఆకలి ఉండేది. కానీ ‘కల్ట్’ ముందు ఆ కసి పదింతలు పెరిగింది. టీజర్లో మీరు చూసింది చాలా తక్కువ. సినిమాలో ఇంకా చాలా ఉంది” అని తెలిపారు. అలాగే, ఈ సినిమా కంటెంట్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని స్పష్టం చేస్తూ, “ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు ఈ సినిమాకి దూరంగా ఉండటం మంచిది. గుండె బలహీనంగా ఉన్నవారు రావొద్దు” అని సూచించారు. మొత్తానికి ‘కల్ట్’ టీజర్‌తో విశ్వక్ సేన్ మరోసారి తన ప్రత్యేక శైలిని చూపించారు. స్లాషర్ జానర్లో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంతటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.