ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న జబ్బు హార్ట్ ఎటాక్. ఏ వయసు వారికి ఎప్పుడు ఇది వస్తుందో తెలియదు. సడెన్ గా వస్తుంది. ప్రాణాలను హరిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపకపోయినా.. ఏమాత్రం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోయినా.. హార్ట్ ఎటాక్ వస్తుంది. అన్ని జబ్బుల కన్నా ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఇది ఒకసారి వస్తే చాలు.. ప్రాణాలు పోయినట్టే. చాలా రేర్ కేసులలో ప్రాణాలను నిలబడతాయి. కొందరికి రెండు మూడు సార్లు వచ్చి.. ప్రాణాలనే తీసుకెళ్తుంది. అందుకే.. జనాలు హార్ట్ ఎటాక్ అంటేనే దడుసుకుంటున్నారు.
ఈనేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుందో వివరించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాన్ అబ్రహం, తన కోస్టార్ దివ్య ఖోస్లాతో కలిసి తన మూవీ సత్యమేవ్ జయతే 2 ప్రమోషన్స్ కోసం కపిల్ శర్మ షోకు వెళ్తాడు.
అక్కడ హార్ట్ ఎటాక్ గురించి మాట్లాడుతాడు. హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుందో తెలుసా? సాధారణంగా నీళ్లలో నూనె పోస్తే.. ఆ నీళ్ల మీద బబుల్స్ ఏర్పడతాయి కదా. అలాగే.. మనం మంచి ఆహారం తీసుకోకపోతే.. ఎక్కువ నూనె పదార్థాలను తీసుకుంటే.. మన రక్తంలో కూడా అలాంటి బబుల్స్ ఏర్పడతాయి. వాటినే ట్రైగ్లిజరైడ్స్ అంటారు. మనం ఎప్పుడైనా ఎక్కువ స్ట్రెస్ కు గురయితే.. రక్తం గుండెకు వేగంగా సరఫరా అవుతుంది. ఆ సమయంలో ట్రైగ్లిజరైడ్స్ కూడా గుండెకు చేరుకుంటాయి. అక్కడికి చేరుకున్నాక.. అవి తిరిగి రక్తంలో కలవకుండా.. గుండె కవాటాల్లోనే ఉండి.. గుండెకు రక్తం సరఫరా కాకుండా అడ్డుకుంటాయి. అందుకే హార్ట్ ఎటాక్ వస్తుంది.. అంటూ జాన్ అబ్రహం.. కళ్లకు కట్టినట్టు వివరించినా కూడా నెటిజన్లు మాత్రం ఎందుకో నిజంగా హార్ట్ ఎటాక్ అందుకే వస్తుందా అనే డౌట్లో పడ్డారు.
I wish our medical students had this much confidence!!!
— Prerna Chettri (@prernachettri) December 8, 2021
Gibberish at all level!!! pic.twitter.com/eOfFI5FUm0
కొందరైతే.. అంతా ఉట్టిదే.. అసలు హార్ట్ ఎటాక్ అందుకు రాదు. నిజంగా జాన్ అబ్రహం లెక్చర్ వింటుంటూనే నాకు హార్ట్ ఎటాక్ వచ్చినట్టు అనిపించింది. ఈయనేదో ప్రసిద్ధి గాంచిన ఫిజిషియన్ అయినట్టు.. ఆయన చెప్పేది అందరూ ఎంత శ్రద్ధగా వింటున్నారు. బబుల్స్ అవి కాదు.. ఈయన బబుల్. ఇంకా నయం.. రక్తంలో మూడు బబుల్స్ ఉంటాయని చెప్పలేదు. ఎందుకంటే.. గ్లిజరైడ్స్లో ట్రై ఉంది కదా. అందుకే.. మూడోసారి వచ్చే హార్ట్ ఎటాక్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని కూడా చెప్పలేకపోయావా? అంటూ నెటిజన్లు మాత్రం ఆ వీడియోపై ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి జాన్ అబ్రహం.. హార్ట్ ఎటాక్ గురించి వింత వివరణ ఇచ్చి నెటిజన్లు ముందు అడ్డంగా బుక్కయిపోయాడు.
Beauty without brains, living in a triglyceride bubble😖
— Arun Valsan (@DrArunKValsan) December 8, 2021
Triglycerides aren't bubbles.
— CA. Allama Prabhu M.S. (@AllamaPrabhuCA) December 9, 2021
He's a bubble.
People listening him seriously becuz he is using some English words in between😁
— Haresh (@Haresh1410) December 9, 2021
Sad part is I would have believed…
— lowkey (@crispr98scisso1) December 8, 2021
HahHhaha
— Prerna Chettri (@prernachettri) December 8, 2021
Logic : pic.twitter.com/1Qd4uNEnX9
— NaDaaN™ (@nosmoking122) December 8, 2021
Doctors to John Sahab pic.twitter.com/lEV3L4efsT
— Abinash (@bubuabinash) December 8, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Train | పెరుగు కోసం రైలు ఆపేసిన డ్రైవర్.. వీడియో వైరలవడంతో..
కూతుళ్లకు టీ ఎలా చేయాలో నేర్పించిన యూఎస్ ఫేమస్ డాక్టర్ సంజయ్ గుప్తా: వీడియో వైరల్
Anand Mahindra : 900 మంది ఉద్యోగులను జూమ్ కాల్లో తీసేసిన ఘటనపై ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
Bipin Rawat : బిపిన్ రావత్‌కు ఘనమైన నివాళి.. దేశమంతా సెల్యూట్: వీడియో వైరల్
కత్రినా, విక్కీ పెళ్లిపై డ్యురెక్స్ కండోమ్ బ్రాండ్ మీమ్ వైరల్