e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News సైర‌ట్ 'జింగాట్' సాంగ్‌కు ద‌ద్ద‌రిల్లిపోయిన యూఎస్ థియేట‌ర్‌.. వైర‌ల్ వీడియో

సైర‌ట్ ‘జింగాట్’ సాంగ్‌కు ద‌ద్ద‌రిల్లిపోయిన యూఎస్ థియేట‌ర్‌.. వైర‌ల్ వీడియో


మీకు సైర‌ట్ మూవీ గుర్తుందా? 2016లో రిలీజ్ అయిన సైర‌ట్ నిజానికి మ‌రాఠీ సినిమా. కానీ.. సెకండ్ హాఫ్ మొత్తం తెలుగులోనే ఉంటుంది. అందుకే.. ఆ సినిమా తెలుగు ఆడియెన్స్‌కు కూడా బాగా క‌నెక్ట్ అయింది. తెలుగు సినిమా అభిమానులు కూడా ఆ సినిమాను ఎంజాయ్ చేశారు.

కులోన్మాద హ‌త్యల నేప‌థ్యంలో సాగే సినిమా అది. అయితే.. ఆ సినిమాలోని పాట‌ల‌న్నీ సూప‌ర్ డూప‌ర్ హిట్. పేరుకు అవి మ‌రాఠీ పాట‌లు అయినా ఇప్ప‌టికీ.. తెలుగు సినీ ప్రేమికులు రోజూ వాటిని విని ఎంజాయ్ చేస్తుంటారు.

- Advertisement -

ముఖ్యంగా జింగాట్ అనే సాంగ్ అయితే ఆ సినిమాకు సోల్. ఆ సాంగ్ మొద‌లైతే చాలు.. ఎవ్వ‌రైనా కాళ్లు క‌ద‌పాల్సిందే. త‌మ‌కు తెలియ‌కుండానే డ్యాన్స్ వేసేలా చేస్తుంది ఆ పాట‌. ఆ పాట‌కు యూఎస్‌లోని ఓ థియేట‌ర్‌లో ఎన్ఆర్ఐలు డ్యాన్స్ వేసి అద‌ర‌గొట్టేశారు. ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

నిజానికి.. ఆ వీడియో 2016లో అప్‌లోడ్ అయిందే. సినిమా రిలీజ్ త‌ర్వాత యూఎస్‌లో సినిమా ప్ర‌ద‌ర్శ‌న స‌మ‌యంలో ఆ పాట ప్రారంభం కాగానే.. అంద‌రూ కిందికి దిగి.. ఆ పాట‌కు డ్యాన్సులు వేసి అద‌ర‌గొట్టేశారు. కొల‌రాడోలోని డెన్వర్‌లో ఉన్న ఓ థియేట‌ర్‌లో ఎన్ఆర్ఐలు ర‌చ్చ ర‌చ్చ చేశారు. ఆ పాట‌కు ఊగిపోయారు. థియేట‌ర్ మొత్తం డ్యాన్స్‌ల మోత‌తో దద్ద‌రిల్లిపోయింది.

ఈ ప్ర‌పంచంలో ఇండియ‌న్స్ అంత హ్యాపీగా ఉండేవాళ్లు ఇంకెవ‌రూ ఉండ‌రు. సైర‌ట్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఇన్ని సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోందా.. అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Fire Panipuri: ఫైర్ పానీపూరీ.. అక్క‌డ ఇదే స్పెష‌ల్‌.. ఎలా తినాలో తెలుసా?

పెళ్లి జ‌రుగుతుండ‌గా.. పెళ్లికొడుకు మీద వాంతి చేసుకున్న పెళ్లికూతురు.. కార‌ణం ఏంటో తెలుసా?

ఇంట్లోకి పాములు దూరాయ‌ని.. ఇల్లునే త‌గుల‌బెట్టేశాడు

కోవిడ్ స‌ర్టిఫికెట్ కోసం కృత్రిమ చేయి పెట్టుకొని వ్యాక్సిన్ వేయించుకోబోయాడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే?

సూట్‌కేసులో దాక్కొని 7000 కిమీలు ప్ర‌యాణించిన బ‌ల్లి.. ఎందుకో తెలుసా?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement