Taxi Top Garden : కరోనా ఎఫెక్ట్.. క్యాబ్‌లను ఖాళీగా ఉంచలేక.. టాప్ మీద గార్డెన్ ఏర్పాటు
కరోనా ఎఫెక్ట్.. క్యాబ్‌లను ఖాళీగా ఉంచలేక | థర్డ్, ఫోర్త్ వేవ్ రూపంలో కబళిస్తోంది. థాయిలాండ్‌లో కూడా అదే పరిస్థితి ఉంది
ప్రస్తుతం కొన్ని దేశాల్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. థర్డ్, ఫోర్త్ వేవ్ రూపంలో కబళిస్తోంది. థాయిలాండ్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. కరోనా వైరస్ సంక్షభం వల్ల.. థాయిలాండ్‌లోని టాక్సీలు అన్నీ మూలకు పడిపోయాయి. టూరిస్టులు లేరు.. క్యాబ్‌లు బుక్ చేసుకునే ప్రయాణికులే లేకపోవడంతో.. షెడ్డుల్లో ట్యాక్సీలు ములుగుతున్నాయి.

దీంతో.. ట్యాక్సీ డ్రైవర్లకు పూట గడవటం కష్టంగా మారిందట. అందుకే.. ట్యాక్సీ కోఆపరేటివ్ మెంబర్స్ అందరూ కలిసి.. పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న క్యాబ్‌ల మీద మినీ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు.
దాని కోసం వెదురుతో కారు టాప్ మీద ఒక ఫ్రేమ్‌లా ఏర్పాటు చేసి మట్టి వేసి.. టమాటాలు, కీరదోశ, బీన్స్ లాంటి చెట్లను కారు రూఫ్ టాప్ మీద నాటారు.
దీంతో.. పైనుంచి కార్లు ఉన్న పార్కింగ్ లాట్‌ను చూస్తే.. అదొక ఆర్ట్‌లా అందరికీ కనిపిస్తోంది. థాయిలాండ్ వీధుల్లో ఉన్న 500 కార్లు, పార్కింగ్ లాట్లో ఉన్న 2500 కార్ల మీద ఈ మినీ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు.
కోవిడ్ వల్ల ట్యాక్సీ డ్రైవర్ల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో చెప్పేందుకే ఇలా మినీ గార్డెన్‌ను ఏర్పాటు చేసి నిరసన తెలుపుతున్నట్టు ట్యాక్సీ కోఆపరేటివ్ మెంబర్స్ చెబుతున్నారు.
థాయిలాండ్‌లో ఇప్పటివరకు 1.4 మిలియన్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. 14 వేల మంది మరణించారు. కరోనా తీవ్రత దృష్ట్యా టూరిస్టులు కూడా ఎక్కువగా థాయిలాండ్‌కు రావడం లేదు. దీంతో ట్యాక్సీలకు గిరాకీ లేదు. లోన్ ద్వారా తీసుకున్న ట్యాక్సీల లోన్ ఈఎంఐ కూడా ప్రస్తుతం కట్టలేకపోతున్నామని ట్యాక్సీ ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకాక్లోనూ ఎక్కువ ట్యాక్సీలు అక్కడికి వచ్చే టూరిస్టుల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటాయి. ప్రస్తుతం టూరిస్టుల తాకిడి తక్కువగా ఉండటంతో.. ట్యాక్సీలన్నీ షెడ్డుకే పరిమితం అయిపోయాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Taxi Top Garden : కరోనా ఎఫెక్ట్.. క్యాబ్‌లను ఖాళీగా ఉంచలేక.. టాప్ మీద గార్డెన్ ఏర్పాటు
SpiderMan Daughter : స్పైడర్‌మ్యాన్ కూతురులా ఉంది.. చకచకా ఎలా ఇంటిగోడను ఎక్కేసిందో చూడండి
Crazy Dance : బాబోయ్.. ఇదేం డ్యాన్స్.. మతిపోతుంది.. వైరల్ వీడియో
Heartbreaking Video : బేబీ డాల్ఫిన్ చనిపోయిందని తెలిసి.. తల్లి డాల్ఫిన్ ఏం చేసిందో చూడండి
Frog Viral Photo : ఈ ఫోటోలో కప్ప ఎక్కడుందో కనిపెడితే మీరు గ్రేట్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

