సోషల్ మీడియాలో పజిల్స్, బ్రెయిన్ టీజర్స్ అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. మెదడుకు పదును పెట్టండి.. అంటూ కొన్ని లాజికల్‌గా ఉన్న పజిల్స్‌ను సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఈ ఫోటోలో చిరుతపులి ఎక్కడుంది. ఈ ఫోటోలో పాము ఎక్కడుందో కనిపెట్టండి.. అంటూ వైరల్ అయ్యే పోస్టులను చాలా చూశాం. అలాంటిదే ఇది కూడా.
కాకపోతే ఈ ఫోటోలో పాము కాదు కప్ప ఎక్కడుందో కనిపెట్టాలి. అయితే.. కప్పను కనిపెట్టడం అంత ఈజీ కాదు. దానికి కారణం ఏంటేంటే.. ఆ కప్ప ఉన్నది.. చిన్న చిన్న రాళ్లు రప్పల మధ్య. దీంతో ఆ కప్ప కూడా ఆ రాళ్లలోనే కలిసిపోయిందన్నమాట.
ఈ ఫోటోను యూఎస్‌కు చెందిన ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వర్షాల కారణంగా.. ఇంటి పక్కన కప్పలు బాగా అరుస్తున్నాయట. దీంతో.. అక్కడికి వెళ్లి చూడగానే ఓ కప్ప తన ముందు ఎగిరి దూకి ముందుకు వెళ్లిందట. వెంటనే తన ఫోన్‌తో క్లిక్మనిపిద్దామనుకునేసరికి.. ఆ కప్ప ఇంకా ముందుకు పోయిందట. అప్పుడే ఆ ఫోటోను తీసి ఆ కప్ప ఎక్కడుందో వెతకగా.. రాళ్ల మధ్య తాపీగా సేద తీరుతోంది ఆ కప్ప. అందుకే.. నెటిజన్లు ఎవరైనా ఆ ఫోటోను చూసి కప్ప ఎక్కడుందో గుర్తు పడతారో లేదో అని టెస్ట్ చేయడం కోసం సోషల్ మీడియాలో ఆ ఫోటోను పోస్ట్ చేసిందట.
కానీ.. నెటిజన్ల నుంచి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందట. ఆ కప్పను గుర్తించడం కోసం ఆ ఫోటోను 600 శాతం జూమ్ చేయాల్సి వచ్చింది అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. నా మాగ్నిఫైడ్ గ్లాస్ ఉపయోగిస్తే కానీ.. నాకు ఆ కప్ప కనిపించలేదు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తం మీద నెటిజన్లు అయితే.. ఆ కప్పను గుర్తించడానికి తెగ తిప్పలు పడుతున్నారు. ఇంతకీ మీకు ఆ కప్ప కనిపించిందా? లేదా? ఒకవేళ కనిపించకపోతే.. కింది ఫోటోలో చూడండి.. ఆ కప్ప ఎక్కడుందో మీకే ఈజీగా తెలిసిపోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సీతాకోక చిలుకకు ప్రాణం పోసిన మహిళ.. వీడియో వైరల్